English | Telugu

కిరాక్ ఆర్పీకి ఒకరోజు కేటాయించిన మెహ్రీన్!

ఒకప్పుడు జబర్దస్త్ లో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న కిరాక్ ఆర్పీ గురించి అందరికీ తెలుసు. ఐతే ఆర్పీ నాగబాబుతో పాటు షో నుంచి బయటకు వచ్చేసి ఫుడ్ బిజినెస్ రంగంలోకి వచ్చేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసును ఫేమస్ చేసే పనిలో పడ్డాడు.

దీనికి సంబందించిన ఎన్నో బ్రాంచెస్ ని ఓపెన్ చేసాడు. రెస్టారెంట్ బిజినెస్ లో మంచి సక్సెస్ అందుకున్నాడు. హైదరాబాదులో ఎన్నో బ్రాంచ్ లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రలోనూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభించారు. త్వరలోనే తిరుపతిలో బ్రాంచ్ ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని ఆర్పి వెల్లడించారు. అయితే నవంబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ రెస్టారెంట్ ప్రారంభం కాబోతుందని చెప్పారు.


ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవాన్ని ప్రముఖ నటి మెహరీన్ చేతుల మీదుగా చేయబోతున్నట్లు కిరాక్ ఆర్పీ వెల్లడించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారేసరికి నెటిజన్స్ అంతా ఆర్పీకి విషెస్ చెప్తున్నారు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక మల్లెమాల సంస్థ గురించి ప్రతీ ఇంటర్వ్యూలో నెగటివ్ గా మాట్లాడేసరికి బుల్లితెర షోస్ లో ఆర్పీ పెద్దగా క్లిక్ కాకపోయేసరికి బుల్లితెరకు పూర్తిగా దూరమైపోయాడు.

ఇక నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసును జనాల్లోకి తీసుకెళ్లడానికి తన బ్రాంచెస్ ని ఇంకా ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాడు అలాగే ఆ రెస్టారెంట్స్ లో మంచి చెఫ్స్ ని పెట్టి ఈ పులుసును ప్రిపేర్ చేయిస్తున్నాడు. ఇక బుల్లితెర, వెండితెర నుంచి చాలామంది కూడా ఆర్పీ రెస్టారెంట్ లో చేపల పులుసును టేస్ట్ చేసి అందరూ మంచి రేటింగ్స్ ఐతే ఇచ్చారు. బుల్లితెర మీద ఉన్న చాల మంది కూడా అటు డైరెక్టర్స్ గా రాణిస్తూ మరో వైపు హీరోస్ గా దూసుకుపోతూ ఇంకో వైపు ఫుడ్ బిజినెస్ లాంటివి పెట్టి రన్ చేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తున్నారు.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.