English | Telugu

'నీకు వారసుడు కావాలంటే దిల్ రాజుని అడగండి' కార్తిక్ కి నరేష్ సలహా

ఎక్స్ట్రా జబర్దస్త్ ఈవారం నవ్వించడానికి చక్కగా ముస్తాబై వచ్చేసింది. ఇందులో కెవ్వు కార్తిక్ టీమ్ చేసిన స్కిట్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ టీమ్ లో నాటీ నరేష్ పెదరాయుడు వేషంలో వచ్చాడు. "నాన్న గారు నాకు పెదరాయుడు అనే పేరు ఎందుకు పెట్టారు" అని నరేష్ కార్తిక్ ని అడిగేసరికి " కనీసం పేరైనా పెద్దగా ఉండాలని" ఆన్సర్ ఇచ్చాడు కార్తీక్. దాంతో షాకయ్యాడు నరేష్..ఇంతలో "పెదరాయుడు నాకు నువ్వు వారసుడిని ఇవ్వాలిరా" అని అనేసరికి "దిల్ రాజు గారిని అడగండి ఐతే అని నరేష్ చెప్పిన ఆన్సర్ కి కార్తిక్ అవాక్కయ్యాడు. ఎందుకంటే వారసుడు మూవీని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళల్లో దిల్ రాజు కూడా ఒకరు. ఇక ఈ టీమ్ లో శాంతి స్వరూప్ లేడీ గెటప్ లో టీచర్ గా వచ్చాడు.

తన దగ్గర ఉన్న రౌడీ మూకకు ఏ,బి,సి,డిలు నేర్పమని కార్తిక్ చెప్పేసరికి "ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే..సి వచ్చి డి పై వాలే..మీరంతా వచ్చి నాపై వాలండి " అనే సాంగ్ ని పాఠంలా చెప్పి నవ్వించాడు శాంతి స్వరూప్. ఇక ఫైనల్ లో పెదరాయుడు మూవీ నుంచి "బావవి నువ్వు..భామను నేను" సాంగ్ కి రష్మీ, శాంతి స్వరూప్, ఖుష్భు కలిసి డాన్స్ చేశారు. మధ్యలో బులెట్ భాస్కర్ వచ్చి ఖుష్భుతో జాయిన్ అయ్యి డాన్స్ చేసాడు. వీళ్లంతా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొచ్చి మరీ ఎంటర్టైన్ చేశారు. ప్రతీ వారం ఫైనల్ లో బులెట్ భాస్కర్-ఖుష్భు డాన్స్ ఉండాల్సిందే..అలా ఈ వారం కూడా డాన్స్ చేసి దుమ్ము లేపారిద్దరూ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.