English | Telugu

ఆయన వచ్చేసారు...మరి మిగతా వాళ్ళు ఉన్నట్టా ? లేనట్టా ?

'ఇండియన్ ఐడల్ తెలుగు' సీజన్ 1 ఆహా ఓటిటి ప్లాట్ఫార్మ్ పై సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఆహా. ఎన్ని ఓటిటి వేదికలు ఉన్నా ఆహా స్పెషల్ అప్పియరెన్స్ తో కొత్త కొత్త షోస్ తో ఆడియన్స్ అలరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ వేదిక మీద 'అన్ స్టాపబుల్' టాక్ షో హిట్ కొట్టింది. ఇక పనిలో పనిగా 'ఇండియన్ ఐడల్ తెలుగు' సీజన్ 2 షూటింగ్ పనులు మొదలయ్యాయి.

ఈ షూటింగ్ స్పాట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కనిపించడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. గ్రీన్ కలర్ జాకెట్ తో కలర్ ఫుల్ లుక్ లో కనిపించారు తమన్. ఫస్ట్ సీజన్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్ కార్తీక్, నటి నిత్యామీనన్ జడ్జెస్ గా వ్యవహరించారు. నెక్స్ట్ సీజన్ కి ఈ ముగ్గురిలో ఒకరు ఆల్రెడీ కనిపించారు. మరి మిగతా ఇద్దరూ ఉంటారా..లేదా అనే విషయాలు మాత్రం ఇంకా రివీల్ కాలేదు. లాస్ట్ ఇయర్ జూన్ లో ముగిసిన సీజన్ 1 కి ఫైనల్ కి జయంత్, వాగ్దేవి, శ్రీనివాస్, వైష్ణవి, ప్రణతీ ఎంపిక కాగా వారిలో టాప్ వన్ గా వాగ్దేవి టైటిల్ గెలుచుకుంది. ఆ టైటిల్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందుకుంది.

ఇక సీజన్ 2 ఎలా ఉండబోతోంది, పాత వాళ్లంతా కంటిన్యూ అవుతారా..ప్రోగ్రాంలో ఎమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా వంటి విషయాలు తెలియాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.