English | Telugu

కృష్ణని ఒక్క మాట కూడా అనే రైట్ నీకు లేదు ముకుంద!

'కృష్ణ ముకుంద మురారి' ఈ సీరియల్ ఇప్పుడు 60వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో కృష్ణని మహాలక్ష్మిలాగా రెడీ చేసి తీసుకొస్తుంది రేవతి. అందరూ కృష్ణని చూస్తు అలాగే ఉండిపోతారు. నీ కోడలు ఎలా ఉంది పెద్దమ్మ అని మురారి అడగగానే.. తనకేంటి బాగానే ఉంటుందని భవాని చెప్తుంది. పూజ పూర్తి అయిన తర్వాత అందరికి హారతి ఇస్తూ వస్తుంటుంది కృష్ణ. హారతి తీసుకో ముకుంద అని అంటుంది. "ఇవి నా నగలు నువ్వు ఎందుకు వేసుకున్నావ్.. నా పెళ్ళికి భవాని అత్తయ్య నాకు ఇచ్చినవి.. నన్ను అడుగకుండా ఎందుకు వేసుకున్నావ్" అని ముకుంద అంటుంది. అలా అనగానే రేవతి మధ్యలో కలుగజేసుకొని "ఆ నగలు ఇంటి కోడళ్ళలో ఎవరైనా పెట్టుకోవచ్చు.. ఆ మాత్రానికే ఇంత రాద్దాంతం చేయాలా?" అని రేవతి ప్రశ్నిస్తుంది. "నాకు ఒక మాట చెప్పాలి కదా.. మీకు కొడుకు, కోడలు సంతోషంగా ఉంటే చాలు ఇంకెవరు అవసరం లేదు కదా" అని ముకుంద అంటుంది. "మాటలు మర్యాదగా రానివ్వు.. మా అత్తయ్య గారిని ఒక్క మాట అన్నా కూడా నేను ఒప్పుకోను" అని కృష్ణ అంటుంది.

ఇదంతా చూస్తున్న భవాని ఆపండి... ఏంటీ ముకుంద నీకు సంస్కారం లేదా చిన్నా పెద్ద తేడా లేకుండా ఆ మాటలు ఏంటీ అని ముకుందని అడుగుతుంది. నగలు తీసుకునేటప్పుడు ఒక మాట అడగాలి కదా అని రేవతిని అంటుంది.

"అసలు విషయం నగల గురించి కాదు అత్తయ్య ఇంట్లో నా ఉనికి గురించి.. ఇంటికి పెద్ద కోడలు అయినా కూడా పూచిక పుల్లను చూసినట్లు చూస్తారు. కూర్చున్న ప్లేస్ నుండి లేపుతారు.. ఎదురుగా వస్తే ఎందుకు వచ్చావ్ అంటారు" అంటూ ముకుంద ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. దీనంతటికి కారణం నువ్వే వెళ్లి ముకుందని సముదాయించు అని కృష్ణని పంపిస్తుంది. కృష్ణతో పాటుగా మురారి కూడా వెళ్తాడు.

ముకుంద వాళ్ళని చూసి గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. సహనం కోల్పోయిన మురారి కోపంతో ముకుందకి చెప్తాడు.‌ "కృష్ణని ఒక్క మాట కూడా అనే రైట్ నీకు లేదు ముకుంద" అని చెప్పి అక్కడి నుండి ఇద్దరు వెళ్ళిపోతారు. బెడ్ మీద పడుకొని ముకుంద చేసింది తప్పు అని కృష్ణ, మురారిలు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.