English | Telugu

మనమీద తనకి డౌట్ వస్తుందేమోనని చెప్పిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -128లో.. మురారి మనం బయటకు వెళ్దాం.. నందు పెళ్ళి పనులు చాలా ఉన్నాయని ముకుంద అంటుంది. ముకుంద, మురారి ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్తారు. అప్పుడు వెయిటర్ వచ్చి .. నీ లవర్ తో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు.‌. అదే నేను చేస్తే ఆ రోజు వాలైంటైన్ డే రోజు నన్ను స్టేషన్ లో వేసి కొట్టావని అంటాడు. అరేయ్ మేము లవర్స్ కాదు రా అని మురారి చెప్తాడు. ఆ తర్వాత మీ కోసం స్వీట్స్ తీసుకొస్తాను అని వెయిటర్ వెళ్ళిపోతాడు. అందరికి మనం లవర్స్ లాగా కన్పిస్తున్నామని ముకుంద అనగానే.. మనమేంటని మన మనస్సాక్షికి తెలుసని మురారి అంటాడు. దానికి సమధానంగా.. మన మనసాక్షికి తెలుసు మనం లవర్సని అంటుంది ముకుంద. ఇంతలోనే వెయిటర్ స్వీట్స్ తీసుకొని వస్తాడు. మనమిద్దరం తినిపించుకుందామని ముకుంద తినిపిస్తుండగా మురారి వద్దని ఆపుతాడు.. దాంతో ఆ స్వీట్ కిందపడిపోతుంది. ఇక అక్కడున్నవారందరు మురారి, ముకుందలనే చూస్తారు. అప్పుడు వెయిటర్ మురారి, ముకుందల గురించి తప్పుగా మాట్లాడుతుండగా... అతడి కాలర్ పట్టుకుంటాడు మురారి. అప్పుడు పక్కనే ఉన్న ముకుంద.. అందరు మనల్నే చూస్తున్నారు వెళ్లిపోదాం పదా అని అంటుంది. ఆ తర్వాత ఇద్దరూ అక్కడ నుండి ఇద్దరు బయలుదేరుతారు.

ఆ తర్వాత తన పెళ్లి నందుతో చేస్తానని మురారి మాటిచ్చాడు కదా అని గౌతమ్ ఆలోచిస్తుంటాడు. అప్పుడు గౌతమ్ ఫ్రెండ్ భాను అక్కడకి వస్తాడు. ఇలా కృష్ణ, మురారిలు.. మా పెళ్లి చేస్తామని మాటిచ్చారంటూ చెప్తాడు.. వాళ్ళు మాటిచ్చారు కదా చేస్తారు.. నువ్వేం ఆలోచించకని అతడి ఫ్రెండ్ భాను అంటాడు. మరోవైపు ముకుంద, మురారిలు ఇంటికి వస్తారు. షాపింగ్ చేసినవి అన్ని కార్ లోనే ఉంచి వెళ్దాం.. ఎందుకంటే కృష్ణ హాల్లోనే ఉంటే మనమీద డౌట్ వస్తుందని ముకుంద అనగానే.. కృష్ణ అలా ఏం ఆలోచించదని మురారి అంటాడు. మనిద్దరం కలిపి ఇంట్లో వరకు ఏడడుగులు వేస్తూ నడుచుకుంటూ వెళ్దామని ముకుంద అనగానే.. నువ్వు ఆదర్శ్ భార్యవి.. నువ్వు నాతో ఏడడుగులు వేస్తే అవి తప్పటడుగులు అవుతాయని మురారి చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇద్దరు రావడం చూసిన రేవతి ఎక్కడికి వెళ్ళారని అడుగగా.. షాపింగ్ కి వెళ్ళామని ముకుంద చెప్తుంది.

భవాని వచ్చి పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయని ముకుందని అడుగగా.. అవుతున్నాయని ముకుంద చెప్తుంది. ఆ తర్వాత కృష్ణని పిలిచి కాలేజీలో నీ పని ఎక్కడ వరకు వచ్చిందని భవాని అడుగగా.. నేను చెయ్యాలనుకున్నది చేస్తున్నాను.. ఈ మధ్య ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశానని కృష్ణ అనగానే.. పక్కనే ఉన్న ముకుంద వింటుంది. నువ్వు జూనియర్ డాక్టర్ వి ఆపరేషన్ చేస్తే ఏదైనా తేడా వస్తే నువ్వు లోపలికి వెళ్తావని ముకుంద అంటుంది. అలా అనకు పేషెంట్ పెద్ద ఆవిడ అని భవానిని ఉద్దేశించి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.