Read more!

English | Telugu

ముకుందని తీసుకురావడానికి వెళ్ళిన మురారి! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ - 65వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. కాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో మురారి దగ్గరికి వెళ్తుంది కృష్ణ. "అత్తయ్య మిమ్మల్ని పట్టించుకోమని చెప్పింది. అందుకనే వచ్చాను" అని కృష్ణ అంటుంది. దానికి మురారి "నీ కళ్ళలో ఏదో అయస్కాంతం ఉంది కృష్ణ" అని అంటాడు. 

మరోవైపు ముకుంద గురించి భవానీ ఆలోచిస్తుంటుంది. ఇంకా ముకుంద ఇంటికి రావడం లేదని నేనే వెళ్లి తీసుకొస్తానని భవాని బయల్దేరుతుండగా... ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్తుందో అనుకుంటారు. "ఈ ఇంటి కోడలు పుట్టింట్లో ఉంటే కుటుంబం పరువు ఏం అవుతుంది... అందరూ పట్టనట్లే ఉన్నారు. నేను వెళ్ళి తీసుకొస్తాను" అని ఇంట్లో వాళ్ళతో భవానీ అంటుంది. "అక్కా... నీకు చెప్పేంత దాన్ని కాదు కానీ ఇప్పుడు ముకుందని ఇంటికి తీసుకురావద్దు.. ఎందుకంటే ఇక్కడ ఒక పెళ్లి అయిన జంట ఉన్నారు. వాళ్ళు సంతోషంగా ఉంటే ముకుంద తనకి ఆ సంతోషం లేదని బాధ పడుతుంది. తన భర్తతో తాను కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటుంది కదా.. ఆదర్శ్ వచ్చే వరకు ముకుందని తీసుకురావద్దు" అని రేవతి చెప్తుంది.  "నువ్వు చెప్పేది నిజమే కానీ మన ఫ్యామిలీ నుండి తనని దూరం చేసిన వాళ్ళం అవుతాం.. ఆదర్శ్ వచ్చి నా భార్యని అలా వదిలేసారు అంటే ఏం సమాధానం చెప్తాం అందుకే నేను వెళ్లి తీసుకొస్తాను" అని భవానీ అంటుంది. అంతలోనే "మీరు వద్దు అత్తయ్యా... ముకుంద అమ్మ నాన్న ఏమైనా మాటలు అంటే మీరు బాధపడతారు. అది నాకు ఇష్టం లేదు. ACP సర్ ని పంపించి..  ముకుందని తీసుకురమ్మని చెప్తాను. ఎలాగైనా సరే ముకుంద ఇంటికి వస్తుంది. నేను మాట ఇస్తున్నాను" అని అంటుంది కృష్ణ.

కృష్ణ పైన గదిలో ఉన్న మురారి దగ్గరికి వెళ్లి.. "మీరు ముకుందని తీసుకురండి. నా వల్లే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. నాకు చాలా గిల్టీగా ఉంది. ముకుందని తీసుకొస్తానని అత్తయ్యకి మాట ఇచ్చాను" అని చెప్తుంది. అప్పుడే అక్కడికి రేవతి వచ్చి "ఏంటి కృష్ణ.. అన్నింట్లో జోక్యం చేసుకుంటున్నావ్? వాణ్ణి ఎందుకు వెళ్లమంటున్నావ్?" అని అడుగుతుంది. సరే మీ ఇష్టమచ్చినట్టు చేసుకోండి అని రేవతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కాసేపటికి "సరే నేను వెళ్తాను" అని మురారి బయల్దేరుతాడు. అయితే మురారి వస్తున్న విషయాన్ని అలేఖ్య ముందుగానే ముకుందకి కాల్ చేసి చెప్తుంది. అలా తను చెప్పటంతో ఎంతో సంబరపడిపోతూ.. అందంగా ముస్తాబై ఇల్లంతా శుభ్రంగా సర్దుతుంటుంది ముకుంద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.....!