English | Telugu

ఇంటినుండి వెళ్ళిపోవడానికి సిద్దమైన కృష్ణ.. మురారి ఆపగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -114 లో.. గౌతమ్ తన ప్రేమ గురించి కృష్ణకి చెప్పడంతో.. నందు, గౌతమ్ ల పెళ్ళి ఎలాగైనా జరిపిస్తానని కృష్ణ గౌతమ్ తో చెప్తుంది. మరోవైపు మురారి తనకు తలనొప్పిగా ఉందని టాబ్లెట్ తీసుకురమ్మని వాళ్ళ అమ్మ రేవతిని పిలుస్తాడు. అది విని రేవతి.. "నీకు చెల్లికి తల్లికి భార్యకి తేడా తెలియట్లేదు.. ఉదయం నువ్వు కృష్ణపై ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదు.. సంస్కారం కోల్పోయి ప్రవర్తించావు" అని మురారిపై రేవతి కోప్పడుతుంది. ఇక అక్కడకి  ముకుంద వచ్చి.. అవును మురారి నువ్వు కృష్ణతో అలా ప్రవర్తించడం బాలేదని అంటుంది. అందరూ నన్నే అనండి.. సరే నేను ఆలా చెయ్యడం తప్పే.. కృష్ణ వచ్చాక సారీ చెప్తాను అని మురారి వారితో అంటాడు.

ఆ తర్వాత కృష్ణ ఇంటికి వస్తుంది. వెళ్ళిపోతున్నావా అని భవాని అడగగా.. అవునని కృష్ణ చెప్తుంది. "నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోతే.. నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలియదు గాని మురారి మాత్రం చాలా బాధపడతాడు. ఇంకా ఈ ఇంటి కోడలు వెళ్ళిపోయిందంటే మాకు బాగుండదు.. అందుకే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను.. ఇక నుండి నువ్వు నందు గురించి పట్టించుకోనని చెప్తే ఈ ఇంట్లో ఉండొచ్చు" అని భవాని అంటుంది. పక్కనే ఉన్న రేవతి.. ఒప్పుకో కృష్ణ అని అంటుంది. నేను వెళ్ళిపోతాను.. నేను బయటకు వెళ్ళినా కూడా నందు గురించి పట్టించుకుంటానని కృష్ణ అంటుంది. "ఎక్కడికి వెళ్తావ్ కృష్ణ.. ఒక ఒంటరి ఆడపిల్లని బయట సమాజం బ్రతకనివ్వదు.. భవాని అక్కకి క్షమాపణ చెప్పి ఇక్కడే ఉండు" అని రేవతి అంటుంది. తప్పు చేసింది మొహం చూపించుకోలేక వెళ్ళిపోతుందని భవాని అనగానే.. నేను ఏ తప్పు చెయ్యలేదని చెప్పేసి కృష్ణ తన గదిలోకి వెళ్ళిపోతుంది.

కృష్ణ బ్యాగ్ తీసుకొని తన గదిలో నుండి వస్తుండగా.. "వద్దు కృష్ణ.. వెళ్ళొద్దు" అని మురారి అంటాడు. "నేను వెళ్తాను.. ఇన్ని రోజులు మీపై గౌరవం ఉండేది. ప్రొద్దున మీరు చేసిన పనికి అది లేకుండాపోయింది. శాసనం లాగా ఇంట్లో చెప్పింది చెయ్యాలి.. ఇంటికి లేట్ గా వస్తే భోజనం పెట్టరు.. మీరు మాట్లాడిన మాటలు అన్నీ నా ఆత్మ గౌరవానికి సంబంధించినవి. నాకు ఆత్మాభిమానం లేని దగ్గర నేను ఉండను" అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.