Read more!

English | Telugu

ఎగ్జామ్ పేపర్స్ ని దొంగిలించిన ధర్మరాజు వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -720 లో.. ధర్మరాజు డబ్బుకి ఆశపడి వేరే కాలేజీ వాళ్ళతో చేతులు కలిపి, రిషి కాలేజీ పరువు తీయాలన్న ఉద్దేశంతో స్పాట్ వాల్యుయేషన్ పేపర్ బండిల్ ని తీసుకుపోతాడు. పేపర్ బండిల్స్ మిస్ అయ్యాయని తెలుసుకొని.. ఎవరు తీసుకువెళ్లారో తెలుసంటూ రిషి, వసుధారలు దొంగని పట్టుకోవడానికి బయల్దేరుతారు.

మరోవైపు ధర్మరాజు ఫోన్ లో మాట్లాడుతుంటాడు. "రేపు రిషి వాళ్ళ కాలేజీ పరువుపోతుంది" అని అనుకుంటూ ధర్మరాజు తన చేతిలో పేపర్ బండిల్ పట్టుకొని ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ.. "మీరు అనుకున్నదే అవుతుంది. నాకు డబ్బులు పంపించండి" అని చెప్తాడు. ధర్మరాజు ఫుల్ గా తాగుతూ.. రిషి సర్ రేపటితో మీ కాలేజీ పని అయిపోయిందని సంతోషపడతాడు. ధర్మరాజే ఆ పేపర్ బండిల్ తీసాడా లేదా కనుక్కోడానికి తను ఉన్న ప్లేస్ కి రిషి, వసుధారలు వస్తారు. ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా ఇద్దరు వస్తారు. "ఏంటి వసుధార.. ఇప్పుడు కూడా బ్యాగ్ తీసుకురావాలా? ఏమైనా కాలేజీకి వెళ్తున్నామా" అని రిషి అంటాడు. అప్పుడే వసుధార తన బ్యాగ్ నుండి తాడు తీసి చూపిస్తూ.. మనం దొంగతనం చెయ్యడానికి వచ్చాము కదా అవసరం అవుద్దని తీసుకొచ్చానని అంటుంది. దొంగలకి సంబంధించిన సినిమాలు ఎక్కువగా చూస్తావా అంటాడు రిషి. అవును సర్.. మనం మన అసలు పేర్లతో కాకుండా మీరు నన్ను 'వి' అని, నేను మిమ్మల్ని 'ఆర్' ని పిలుచుకుందామని వసుధార అంటుంది. రిషి లోపలికి వెళ్తుంటే.. సర్ ఏంటీ కాలేజీకి వెళ్తున్నట్లు స్టైల్ గా వెళ్తున్నారని వసుధార అడుగుతుంది. నాలా మెల్లిగా నడవండని వసుధార చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు లోపలికి వెళతారు.

లోపలికి వెళ్ళగానే ఫుల్ డ్రింక్ లో ఉన్న ధర్మరాజుని చూస్తారు ఇద్దరు. చాటుగా వెళ్ళి అక్కడున్న రూమ్ అంతా వెతుకుతారు. అప్పుడే ధర్మరాజు.. మీ కాలేజీ పరువుపోవడం ఒకరికి కావాలని తనలో తానే మెల్లిగా  అనుకుంటుండగా.. రిషి అది విని.. ఎవరికంత అవసరం ఉందని అనుకుంటాడు. ఇక ధర్మరాజు లోపలికి సడన్ గా రావడం తో.. కర్టెన్ అడ్డుగా దాక్కుంటాడు రిషి. కానీ వసుధారని ధర్మరాజు చూసేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.