English | Telugu

తన కూతురి కాపురం చక్కదిద్దమని మురారిని రిక్వెస్ట్ చేసిన శ్రీనివాస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -163 లో.. ముకుంద వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఈ ఇంట్లో ఉండలేకపోతున్న నాన్న.. వాళ్ళిద్దరు అలా సంతోషంగా ఉండడం భరించలేకపోతున్నా నాన్న అని ముకుంద అంటుంది. మరి మన ఇంటికి వచ్చేయమని శ్రీనివాస్ అంటాడు. నేను వస్తే ఇక వాళ్ళిద్దరికి ఏ అడ్డు ఉండదు అందుకే నేను ఇక్కడే ఉంటాను నాన్న. మురారి ప్రేమలో పడ్డట్టు అనిపిస్తుంది. నువ్వే ఎలాగైనా మురారితో మాట్లాడాలి. కృష్ణ వెళ్లిపోయాక మురారి నన్నే పెళ్లి చేసుకునేలా చెయ్యాలి.. తనతో మాట్లాడు నాన్న అని ముకుంద అంటుంది. నీకోసం ఏదైనా చేస్తానని సమాధానమిస్తాడు శ్రీనివాస్.

మరొకవైపు కృష్ణని దింపడానికి మురారి వెళ్తాడు. అక్కడ ఇద్దరు ఐస్ క్రీం తింటుంటారు. మురారికి ఐస్ క్రీం అంటకోవడంతో.. కృష్ణ తన చీర కొంగుతో తుడుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీనివాస్.. వాళ్లిద్దరూ అలా ప్రేమగా ఉండడం చూస్తాడు. కాసేపటికి కృష్ణ హాస్పిటల్ లోపలికి వెళ్ళడంతో మురారి దగ్గరికి శ్రీనివాస్ వస్తాడు. "నువ్వు చూపించేది ప్రేమా? అభిమానమా?" అని మురారిని శ్రీనివాస్ అడుగుతాడు. మీరేం మాట్లాడుతున్నారు.. తను నా భార్య అని మురారి అంటాడు. ముకుంద మీ అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి అంతా చెప్పింది. కృష్ణ వెళ్ళిపోగానే తనని పెళ్లి చేసుకుంటావని ముకుంద ఆశగా ఎదురుచూస్తుందని శ్రీనివాస్ అంటాడు.

ఏం మాట్లాడుతున్నారు మీరు.. పరాయి వాడి భార్యని నేను పెళ్లి చేసుకోవడమేంటని మురారి అంటాడు. నా కూతురిని ప్రేమించి అన్యాయం చేసావ్.. దాని జీవితమెలా అని శ్రీనివాస్ ప్రశ్నించగా.. మీ కూతురి జీవితం గురించి మీరు..మా పెద్దమ్మ మాట్లాడుకోండి. నన్ను పెళ్లి చేసుకోమని అనడం ఎంతవరకు కరెక్ట్.. ఒక ఆడపిల్ల గొంతు కోసి, మీ కూతురిని ఎలా పెళ్లి చేసుకోగలను. కృష్ణ ఒక వేళ వెళ్ళిపోతానని చెప్పినా నేను వెళ్ళనివ్వను.. కృష్ణకి నేను తప్ప ఎవరు లేరని మురారి అంటాడు.

నేను ఇలా అనడం తప్పే బాబు.. నా కూతురు కోసం వేరొక ఆడపిల్ల గొంతు కోయమని చెప్పను. కానీ మీరు ఒక హెల్ప్ చెయ్యండి.. ముకుందకి నీపై ద్వేషం కలిగేలా చెయ్యండి.. అప్పుడు ముకుంద మా ఇంటికి వస్తుంది. ఆదర్శ్ వచ్చేవరకు చూస్తాను. రాకుంటే వేరే పెళ్లి చేస్తానని శ్రీనివాస్ అంటాడు. దానికి మురారి సరేనంటాడు.

మరొక వైపు కృష్ణ హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత కూడా మురారిని పదే పదే గుర్తు చేసుకుంటుంది. ఎవరిని చూసిన మురారిలాగా ఉహించుకుంటుంది. మరొకవైపు మురారి కార్ లో వెళ్తూ.. ముకుంద అనేసిన మాటలు గుర్తు చేసుకుంటాడు. అలాగే శ్రీనివాస్ చెప్పిన మాటలన్నీ గుర్తుచేసుకుంటాడు. ఎలాగైనా ముకుందకి నాపై ఉన్న ప్రేమని, నా ప్రవర్తనతో ద్వేషం కలిగేలా చెయ్యాలని మురారి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.