English | Telugu

పాలల్లో మత్తు మందు కలిపిచ్చిన ముకుంద.. కృష్ణ పసిగడుతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -273 లో.. దోమలను కొడుతున్న కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. తన చిన్న పిల్లల చేష్టలు చూసి నవ్వుకుంటాడు. బయట ముకుంద టార్చర్ చేస్తున్న నీ దగ్గరికి వచ్చేసరికి అవన్నీ మర్చిపోతానని మురారి తన మనసులో అనుకుంటాడు.

ఆ తర్వాత దోమలని ఎలా రాకుండా చెయ్యాలని మురారికి కృష్ణ పెద్ద ప్లానే చెప్తుంది. అది విన్న మురారి.. ఇందుకే కదా నిన్ను తింగరి పిల్ల అనేదని మురారి అంటాడు. ఆ తర్వాత నవ్వుతు దోమలు రాకుండా రీఫిల్ పెడితే చాలని కృష్ణకి చెప్తాడు. మరొక వైపు ముకుంద ఒంటరిగా మురారి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. అలా బాధపడుతున్న ముకుంద దగ్గరికి అలేఖ్య వస్తుంది. నువ్వేనా ఇలా బాధపడేదని అడుగుతుంది. ముకుంద మౌనంగా ఉంటుంది. నీ ప్రేమని నువ్వు సాధించుకో అంటు ముకుందకి అలేఖ్య సలహా ఇస్తుంది. నా ప్రేమ మురారికి అర్థం కావడం లేదు, నా ప్రాణం పోయిన మురారిని మాత్రం వదలనని ముకుంద అనగానే.. నీకు ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ కావాలన్న చేస్తానని అలేఖ్య చెప్తుంది. మరొక వైపు మురారికి కృష్ణ కాఫీ తీసుకొని వస్తుంది. ఇందాక మధు అలేఖ్య ఇద్దరు కాఫీ ఎవరు ముందు తాగారని గొడవ పడ్డారని అనగానే.. కలికాలం పాతకాలం రోజుల్లో భార్యలు ఇలా ఉండేవారు అలా ఉండేవారని కృష్ణకి మురారి చెప్తాడు. ఆ తర్వాత నువ్వు కాఫీ తాగావా అని కృష్ణని మురారి అడుగుతాడు. మీరు తాగాక తాగుతానని చెప్పేసి కృష్ణ వెళ్ళిపోతుంది. ఈ కృష్ణ ఏంటో అసలు అర్థం కాదని మురారి అనుకుంటాడు.

మరొక వైపు భవానికి పాలు కలుపుకొని వెళ్లి అందులో మత్తుగా ఉండి నిద్రపోయేలా పాలలో ముకుంద ఏదో కలుపుతుంది. అలా భవాని నిద్ర పోయాక తన ఫోన్ లో ఉన్న కల్నల్ నెంబర్ ని డిలీట్ చెయ్యాలనుకుంటుంది ముకుంద. ఆ తర్వాత ఈ పాలు తీసుకొని వెళ్లి భవాని అత్తయ్యకి ఇవ్వమని అలేఖ్యకి ముకుంద చెప్పగానే.. నాకు భయం. నేను వెళ్ళనని అలేఖ్య అంటుంది. దాంతో ముకుంద భవాని దగ్గరికి వెళ్లి పాలు ఇస్తుంది. భవాని పాలు తాగకుండా పక్కన పెట్టి ఏదో మాట్లాడాలని వచ్చినట్టు ఉన్నావ్ ఏంటని అడుగుతుంది. ఇక ఇదంతా వద్దు డైరెక్ట్ నిజం చెప్పేస్తానని ముకుంద అనుకుంటుంది. అదంత కృష్ణ భయట నుండి చూస్తూ నిజం చెప్పేస్తుందా ఏంటి అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ‌

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.