Read more!

English | Telugu

ఆ ఇద్దరిని ఎంజాయ్ చేయమని పంపించిన రేవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ ఎపిసోడ్ -78 లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం రోజు జరిగిన ఎపిసోడ్ లో.. కృష్ణ తన గదిలో ఉన్న వాళ్ళ నాన్న ఫోటో చూస్తూ.. " అత్తయ్య గారు నేను చదువుకోవడానికి ఒప్పుకున్నారు" అని చెప్పుకుంటూ సంతోషపడుతుంది. అంతలోనే రేవతి వచ్చి.. "కృష్ణా.. మీరిద్దరు బయటికి వెళ్తున్నారంట కదా.. నేను నిన్ను రెడీ చేస్తాను" అని కృష్ణని రెడీ చేస్తుంది. ఇక కృష్ణ ఈ ఏసిపి సర్ ఎక్కడికెళ్ళారు.. ఎప్పుడూ ఎక్కడికో ఒక దగ్గరకి వెళ్తారు. కొంపదీసి సిగరెట్ తాగే అలవాటు ఉందా అని పైనకి వెళ్లి ఎవరు లేని చోట సిగరెట్ తాగి వస్తాడా అని అనుకుంటుంది. మురారి కోసం కృష్ణ డ్రెస్ సెలక్ట్ చేస్తుండగా.. అంతలోనే మురారి వస్తాడు. ఒకసారి మీరు ఉండండి సర్ అని కృష్ణ అంటుంది. ఎందుకని మురారి అనగా.. మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందేమో అని డౌట్ నాకు అని కృష్ణ అడుగగా.. అలాంటిదేం లేదని మురారి అంటాడు. కృష్ణకి నచ్చిన డ్రెస్ మురారికి కూడా నచ్చడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఇక కృష్ణ, మురారి ఇద్దరు రెడీ అయ్యి వస్తుంటే... ఎక్కడికి వెళ్తున్నారని సుమలత అడుగుతుంది. అక్కడే ఉన్న రేవతి.. వాళ్ళిద్దరూ బయటికి వెళ్తున్నారని చెప్తుంది. "ఇద్దరు చాలా బాగున్నారు.. ఏ పాపిష్టి కన్ను మీ మీద పడకూడదు"  అని ముకుందని చూస్తూ రేవతి అంటుంది. లేట్ అవుతుందని ఆలోచించకుండా, ఎంజాయ్ చేసి రండి అని రేవతి వాళ్ళని పంపిస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలని ముకుంద ఆలోచిస్తూ.. వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఫాలో అవుతుంది.
  
కృష్ణ, మురారి రెస్టారెంట్ కి వెళ్తారు. "ప్లేట్ లో నేనే మీకు వడ్డీస్తాను.. ఇలా మీరు తింటున్న ప్రతీసారి నేనే గుర్తు రావాలి.. ఎందుకంటే నా చదువు అయిపోయాక, మీతో ఉండను కదా" అని కృష్ణ అనేసరికి.. మురారి ఒక్కసారిగా డల్ అవుతాడు. "నేను నీకు వడ్డిస్తాను కృష్ణ" అని మురారి అనగానే.. లేదు ఏసిపి సర్.. నేను తింటున్న ప్రతీసారి మీరు గుర్తొస్తారని కృష్ణ అంటుంది.  ఇలా వాళ్లిద్దరూ రెస్టారెంట్ లో ఉన్నప్పుడు.. వాళ్ళకి తెలియకుండా వారిని ఫోటో తీసి మురారికి పంపిస్తుంది. అది చుసిన మురారి.. అటు ఇటు చూస్తు ఉంటే ఏమైంది అలా చూస్తున్నారని కృష్ణ అడుగుతుంది. లేదు ఎవరో తెలిసిన వాళ్ళు కన్పించారేమోనని చూసానని కవర్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.