English | Telugu

నందు, గౌతమ్‌ల పెళ్ళిళ్ళు.. మురారికి మొదలైన టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -129 లో.. మురారి తన గదిలో ఆలోచిస్తుంటాడు. "ఓ వైపు నందు పెళ్లి.. మరోవైపు గౌతమ్ పెళ్లి చేస్తానని కృష్ణకి మాట ఇచ్చాను. ఇద్దరిది ఆదివారమే.. నాకు పెద్ద పరీక్షలాగా అనిపిస్తుంది" అని మురారి అనుకుంటాడు. "పెద్దమ్మని నందు పెళ్లి ఏ టైం కి ఫిక్స్ చేసారో అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ మార్నింగ్ నందు పెళ్లి అయితే గౌతమ్ ది సాయంత్రం చెయ్యొచ్చు. ఒకవేళ నందుది సాయంత్రం అయితే గౌతమ్ ది మార్నింగ్ చెయ్యొచ్చు" అని భవాని దగ్గరికి వెళ్తుండగా కృష్ణ వస్తుంది. అనుకోకుండా మురారి కి కృష్ణ తగిలి కింద పడిపోతుంది. కింద పడ్డ కృష్ణ ని ఏమైందని అడుగగా.. దయ్యం పట్టిన దానిలాగా యాక్టింగ్ చేస్తుంది కృష్ణ. తను యాక్టింగ్ చేస్తుందని గుర్తించి‌న మురారి సరే అని ఆటపట్టిస్తాడు.

ఆ తర్వాత హాల్లో కూర్చొని భవానీ, ఈశ్వర్, ప్రసాద్ లు మాట్లాడుకుంటారు. ‌మురారి దేనికో టెన్షన్ పడుతున్నాడు.. కృష్ణ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉందని ఈశ్వర్ తో అంటుంది భవాని. అవును వదిన.. తనేదో ఆపరేషన్ సక్సెస్ చేస్తానని సవాల్ కూడా చేసిందని పక్కనే ఉన్న ప్రసాద్ అంటాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి మురారి ఒక్కడే వచ్చి.. నందు పెళ్ళి ముహూర్తం ఎప్పుడని అడుగుతాడు. ఆదివారం ఒంటిగంట అని ఈశ్వర్ చెప్పగానే.. సరే అని వాళ్ళకి చెప్పేసి అక్కడి నుండి మురారి వెళ్తాడు. ఆ తర్వాత ముకుంద భవాని దగ్గరికి వచ్చి.. నందు పెళ్ళి కోసం రేపు నేను, మురారి కళ్యాణ మండపం చూడటానికి వెళ్తామని చెప్పగా.. సరేనని భవాని అంటుంది. ముకుంద అక్కడ నుండి వెళ్తుండగా భవాని తనని ఆపి... నందు పెళ్ళి విషయం రేవతికి, నందుకి తెలియకూడదు. ముఖ్యంగా కృష్ణకి తెలియకుండా చూసుకోమని చెప్తుంది భవాని. సరేనని చెప్పేసి ముకుంద వెళ్తుంది.

ఆ తర్వాత కృష్ణ దగ్గరికి వెళ్ళిన మురారి.. గౌతమ్ సర్ పెళ్ళి ఆదివారం కదా నేను రాలేను నాకు అత్యవసరంగా ఒక పని చేయవలసి వచ్చిందని చెప్పగా.. "నేను మిమ్మల్ని ఆస్తులడిగానా, అంతస్తులడిగానా ఒక ప్రేమజంటకి పెళ్ళి చేయమని చెప్పాను అంతే కదా.. ఇప్పుడు అది కూడా చేయరు కదా.. మీరు కూడా అందరిలాంటి మగాళ్ళే" అని కృష్ణ ఫీల్ అవుతుండగా.. తనని నవ్వించడానికి మురారి జోక్ చేసానని చెప్తాడు. ఓ.. అవునా అని కృష్ణ కూల్ అవుతుంది. ఆ తర్వాత గౌతమ్ పెళ్ళి ముహూర్తం ఎప్పుడని కృష్ణని మురారి అడుగగా.. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకి ముహూర్తమని చెప్పడంతోనే దిగులుతో నిల్చున్న దగ్గరే కూర్చుండిపోతాడు. దాంతో ఏమైందని కృష్ణ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.