English | Telugu

పెళ్ళి కాలేదనే నిజం చెప్పేసిన మురారి.. సంతోషంలో ముకుంద!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్.. గత ఎపిసోడ్ లో ముకుంద తన ప్రేమ విషయం కృష్ణకి చెప్తుందా లేదా అన్న ట్విస్ట్ తో ముగించగా.. బుధవారం ఎపిసోడ్ -81లోకి అడుగుపెట్టింది. కాగా ఈ ఎపిసోడ్ లో.. మురారి ఫోన్ కి ముకుంద ఫోన్ చేస్తుంది. కృష్ణతో మాట్లాడుతుంది ముకుంద. ఆ తర్వాత నిజం చెప్పేసిందేమోనని మురారి టెన్షన్ పడుతుంటాడు. "ఏంటి కృష్ణా.. ముకుంద ఏమంటుంది" అని టెన్షన్ పడుతూ అడుగుతాడు. ఏం లేదు ఏసీపి సర్.. తన గదిలోకి రమ్మని చెప్పింది. అలా అనగానే మురారికి టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకు రమ్మని పిలించిందని అడుగుతాడు. తను వెళ్ళొచ్చాక చెప్తానని చెప్పి ముకుంద దగ్గరకి వెళ్తుంది.

అలా ముకుంద గదిలోకి కృష్ణ వెళ్తుంది. అలా వెళ్ళగానే.. "ఏంటీ కృష్ణా.. మీ హనీమూన్ ఎందుకు క్యాన్సిల్ అయింది" అని ముకుంద అడుగుతుంది. అంటే నా చదువుకి సంబంధించిన సర్టిఫికెట్స్.. రెడీ చేసుకోవాలి.. అందుకే వెళ్ళట్లేదని కృష్ణ అంటుంది. "అంటే మురారి నేను చెప్పానని క్యాన్సిల్ చేయలేదన్న మాట" అని ముకుంద తన మనసులో అనుకుంటుంది. కాసేపటికి కృష్ణ అక్కడ నుండి బయటకు వస్తూ ఆలోచిస్తుంది. ముకుందనే మా హనీమూన్ క్యాన్సిల్ అయిందని ఇంత ఫీల్ అవుతుంటే అత్తయ్య ఇంకెంతగా బాధపడుతుందోనని కృష్ణ ఆలోచిస్తుంది. ఆ తర్వాత రేవతి దగ్గరికి వెళ్తుంది కృష్ణ. అత్తయ్యా అని కృష్ణ మాట్లాడుతుండగా.. తనని మాట్లాడనివ్వకుండా.. "ఎందుకు హనీమూన్ వద్దని అంటున్నారు" అని రేవతి అడుగుతుంది.. అత్తయ్య నా చదువుకి సంబంధించిన సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి అని చెప్తుంది. మీ జీవితం బాగుండాలనే చేస్తున్నాను కృష్ణా.. నాకు మురారి ఎంతనో నువ్వు కూడా అంతేనని రేవతి అనడంతో.. కృష్ణ ఒక్కసారిగా ఎమోషనల్ అయి రేవతిని హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఎమోషనల్ అవుతూనే హాల్లోకి వస్తుంటుంది. అప్పుడే మురారి వస్తుంటాడు. కృష్ణని చూసిన మురారి.. "ఏమైందని" అడుగుతాడు. కృష్ణ అక్కడ జరిగిందంతా చెప్పి మురారిని హత్తుకొని ఏడుస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా హగ్ చేసుకోవడం ముకుంద చూస్తుంది.

ఆ తర్వాత మురారిని రమ్మని పిలుస్తుంది ముకుంద. అలా పిలిచాక ముకుంద దగ్గరకి మురారి వస్తాడు. "ఏం జరుగుతుంది మురారి.. నీ భార్యేంటి.. నీ గుండెలకు హత్తుకొని ఉంది" అని ముకుంద ఆవేశంగా మాట్లాడుతుంది. మురారికి కోపం వచ్చి.. "అసలు కృష్ణకి నాకు పెళ్లి కాలేదు.. మాది ఒక అగ్రిమెంట్ మ్యారేజ్.. కృష్ణ చదువు అవడంతోనే తను వెళ్ళిపోతుంది" అని ముకుందకి చెప్పేసరికి తను పట్టరాని సంతోషంతో మురారి ని హగ్ చేసుకొని.. "ప్రేమికుల రోజు నాడు నాకు మంచి న్యూస్ చెప్పావ్" అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.