English | Telugu

ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్.. షాకిచ్చిన బిగ్ బాస్!

బిగ్ బాస్ గత మూడు వారాల నుండి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో మరో షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటంటే ఒక వైపు ర్యాంకింగ్స్ కోసం కంటెస్టెంట్స్ అందరు అయోమయంలో ఉండగా "ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. ఇందులో తక్షణమే హౌస్ నుండి ఎవరిని బయటకు పంపాలనుకుంటున్నారో చెప్పండి" అని బిగ్ బాస్ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

అయితే ఇక్కడ మరో ట్విస్ట్ పెట్టాడు బిగ్ బాస్. "ఎవరిని తక్షణమే హౌస్ నుండి పంపాలో.. టికెట్ టు ఫినాలే రేస్ లో గెలిచి మొదట ఫైనల్ కి వెళ్ళిన శ్రీహాన్ చెప్తాడు" అని బిగ్ బాస్ చెప్పడంతో, "ఆశ్చర్యంగా ఏంటి బిగ్ బాస్.. ఇలా చెప్పారు" అని శ్రీహాన్ అన్నాడు. ఇది కూడా ఏకాభిప్రాయంతో చెప్పండి అంటే సరిపోతుంది కదా?.. నన్ను ఎందుకు ఇరికించారు. తక్షణమే ఎలిమినేషన్ అంటే నా వల్ల కాదు బిగ్ బాస్" అని శ్రీహాన్ అన్నాడు. "చెప్పండి శ్రీహాన్.. ఎవరు ఈ హౌస్ లో అన్ డిజర్వింగ్ అని మీరు భావిస్తున్నారు? ఎవరిని హౌస్ నుండి బయటకు పంపాలనుకుంటున్నారు?" అని బిగ్ బాస్ మరోసారి అడిగాడు. దీంతో చేసేదేమి లేక రోహిత్ పేరు చెప్పాడు శ్రీహాన్.

"పర్సనల్ రీజన్ ఏమీ లేదు‌‌.. ఫస్ట్ వీక్ నుండి మీరు ఏమీ ఆడలేదు. ఈ నాలుగు, అయిదు వారాల నుండి అందరితో కలిసి ఉంటున్నారు. ఇదే ఫస్ట్ వీక్ నుండి ఉంటే బాగుండేది, చాలా చేంజ్ అయ్యారు మీరు" అని శ్రీహాన్ అనగా "స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నానో, ఇప్పుడు అలానే ఉన్నాను. అన్నీ బాగున్నాయని అన్నావ్ కానీ అలా చెప్పడం కాదు" అని రేవంత్ జవాబిచ్చాడు. ఆ తర్వాత కీర్తి, రోహిత్ మాట్లాడుకున్నారు. "శ్రీహాన్ ఆర్టిఫిషియల్.. హీ ఈజ్ నాట్ నాచురల్.. హీ ఈజ్ నాట్ జెన్యూన్.. ఇంటరాక్షన్ తక్కువ అని అన్ డిజర్వింగ్ ఇవ్వడం ఏంటి" అని కీర్తిభట్ తో రోహిత్ అన్నాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.