English | Telugu

అవకాశాల కోసం..!

ఈ మధ్యకాలంలో సినిమాలతో పాటు టీవీ కంటెంట్ కు కూడా క్రేజ్ పెరుగుతోంది. అందుకే టీవీ యాంకర్స్ తో పాటు ప్రోగ్రాంలో పాల్గొనే వారికి కూడా మంచి క్రేజ్ వస్తోంది. ముఖ్యంగా లేడీ యాంకర్స్ పాపులారిటీ పెరిగిపోతుంది. పద్దతిగా ఉండేవారి కంటే హాట్ షో చేసేవారికి మంచి గుర్తింపు దక్కుతోంది. ఇప్పటికే అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీముఖి, విష్ణుప్రియ, వర్షిణి ఈ రంగంలో సత్తా చూపిస్తున్నారు. ఇప్పుడు మరో తెలుగు యాంకర్ కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

రీసెంట్ గా మొదలైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి మంచి రేటింగ్స్ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా టాలెంటెడ్ వ్యక్తులను గుర్తించి ఈ షోలో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ఆ ప్రదర్శనలతో పాటు సుడిగాలి సుధీర్ సహా 'జబర్దస్త్' టీమ్ సభ్యులు పాల్గొంటూ కామెడీ పంచుతున్నారు. వీరితో పాటు కొందరు అందమైన అమ్మాయిలను కూడా ఈ షోలోకి తీసుకొస్తున్నారు. అలా వచ్చిన వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు.

సోషల్ మీడియాలో ఈమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో ఈమె చాలా సార్లు కనిపించింది. ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానెల్స్ కి యాంకర్ గా పని చేసిన ఈమె మరిన్ని అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లేస్ తో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని మిర్రర్ ముందు నుంచొని ఆమె ఇచ్చిన ఫోజులకు యూత్ ఫిదా అయిపోయింది. సినిమా అవ‌కాశాల కోస‌మే ఆమె ఈ హాట్ పోజులిచ్చిందంటున్నారు నెటిజ‌న్లు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...