Read more!

English | Telugu

బలగం మూవీ చూసి చాలా ఎమోషనల్ అయ్యాను...నా లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది

కళ్యాణం- కమనీయం సీరియల్ హీరో మధుసూదన్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ ఫాన్స్ చాలా మంది ఉన్నారు. గోరంత దీపం, నా పేరు మీనాక్షి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్ మధుసూదన్ రీసెంట్ గా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు"మూవీస్ లో ఆఫర్స్ వచ్చాయి కానీ పెద్దగా బ్రేక్ రాలేదు. దాంతో నేను సీరియల్స్ లో నటించడానికే ఎక్కువగా ఇంటరెస్ట్ చూపిస్తున్నాను. నెల మొత్తం కూడా ఈ షూటింగ్స్ తో బిజీగా ఉంటాను. సినిమా అంటే ఎప్పటికో కనిపిస్తాం..అందులోనూ ఆడియన్స్ థియేటర్ కి వచ్చి చూడాలి కానీ సీరియల్ అలా కాదు ప్రతీ రోజు మేమే వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తూ పలకరిస్తూ ఉంటాం. నా కాస్ట్యూమ్స్ ని నేను ఎక్కువగా సెలెక్ట్ చేయను. అంతా నా కూతురు సెలక్షన్  . నాకు ఎర్లీగా పెళ్లయిపోయింది  కాబట్టి నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కూతురు ఉంది. తానే మొత్తం చూసుకుంటూ ఉంటుంది.

గోరంత దీపం సీరియల్ నాకు మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. నాలో నాకు నచ్చని విషయం అంటే కోపం, షార్ట్ టెంపర్..నా బాడీ మీద ఓం అని, నా వైఫ్ , నా కూతురు, కొడుకు పేర్లను టాటూస్ గా వేయించుకున్నా. మోగలే ఆజం నా ఫేవరేట్ మూవీ. మనీ ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి మునికే ఇంపార్టెన్స్ ఇస్తాను. మెంటల్ స్ట్రెంత్ నాకు చాలా ఎక్కువ. నాలో పనికిరాని టాలెంట్ కూడా ఉంది...అది సింగింగ్, డాన్సింగ్. నా చుట్టుపక్కల  డేంజరస్ పర్సన్స్ ఉన్నారు అని తెలిస్తే వెంటనే వాళ్లకు దూరంగా వెళ్ళిపోతాను. నాకు సైక్లింగ్ అంటే ఇష్టం. కాలేజీ టైములో నా ఫ్రెండ్స్ నన్ను మ్యాడీ అని నిక్ నేమ్ తో పిలిచేవాళ్ళు. బలగం మూవీ చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను.. నేను రిజర్వ్డ్ గా ఉంటాను. నా హ్యాబిట్స్ లో ఏదైనా చేంజ్ చేసుకోవాల్సి వస్తే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడానికి ట్రై చేస్తాను. రిలేషన్ షిప్ బెస్ట్ గా ఉండాలి అంటే అండర్స్టాండింగ్ ఉండాలి...శాక్రిఫైస్ చేసుకుంటూ ఉండాలి. నా దృష్టిలో రొమాన్స్ అంటే బ్యూటిఫుల్ ఫీలింగ్. చికెన్ బిర్యానీ లేకుండా ఉండలేను....నా లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది..." అంటూ ఎన్నో విషయాలు చెప్పాడు మధుసూదన్.