English | Telugu

మా నాన్న సొంత ఇంటి కలను నేను నెరవేర్చాను...ప్రియాంక సింగ్

జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. అందులో భాగంగానే సాయి తేజ అలియాస్ ప్రియాంక సింగ్ కి కూడా లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ అమ్మాయిలకు అసూయ పుట్టించేలా అందంగా రెడీ అవుతూ అచ్చమైన అమ్మాయిలనే చేసేవాడు సాయి తేజ. అలా అబ్బాయిగా ఉన్న సాయి తేజ కాస్త అమ్మాయిగా మారిపోయి ప్రియాంక సింగ్ గా కొత్త జన్మ ఎత్తింది. ఇక ఇప్పుడు ప్రియాంక సింగ్ తన కన్న కలను నెరవేర్చుకుంది. బిగ్ బాస్ లో కూడా సొంత ఇంటి కల గురించి చెప్పింది. ఇప్పుడు ఆ కోరికను నెరవేర్చుకుంది. తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో సొంత ఇల్లు కట్టించుకుంది.

ఐతే ఇంటి గృహప్రవేశం ఎప్పుడో ఐపోయింది కానీ దానికి సంబంధించిన వీడియోని మాత్రం సోషల్ మీడియాలో లేట్ గా అప్ లోడ్ చేసింది ప్రియాంక సింగ్. అలాగే ఈ సొంత ఇంటి గృహప్రవేశ సమయంలో తన పేరెంట్స్ తో కలిసి ఒక యజ్ఞం చేసినట్లు చెప్పింది. తన లైఫ్ లో పేరెంట్స్ తో కలిసి చేసిన ఫస్ట్ పూజ అని చాలా జోష్ తో చెప్పింది. వాళ్ళ నాన్నగారు ఈ ఇల్లు కట్టించాక ఎంతో హ్యాపీగా ఫీలయ్యారని చెప్పింది. ఇక తన ఇల్లు మొత్తాన్ని కూడా మరో హోమ్ టూర్ చేసి చూపిస్తాను అని చెప్పింది. ఇక ప్రియాంక సింగ్ చేసిన ఈ పనికి నెటిజన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. పేరెంట్స్ ని బాగా చూసుకుంటున్నారని పొగిడేశారు. ప్రియాంక సింగ్ తన లైఫ్ జరిగిన విషయాలకు బాధ పడకుండా ధైర్యంగా ముందడుగు వేసింది.

అలాంటి టైములో ఆమెకు బిగ్ బాస్ రూపంలో ఒక మంచి అవకాశం వచ్చింది. బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చాక అందరితో సమానంగా గేమ్ ఆడి తనను తాను ప్రూవ్ చేసుకుంది. కొంత కాలం వరకు చీరకట్టులో ఎంతో అందంగా కనిపించిన ప్రియాంక సింగ్ ఇప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో ఇన్స్టాగ్రామ్ లో ఫాన్స్ తో టచ్ లో ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.