Read more!

English | Telugu

జూన్ 12 నుంచి  మా వారు మాష్టారు!

జీ తెలుగులో ప్రసారమయ్యే  సీరియల్స్ తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. ఇందులో ప్రసారమయ్యే చాలా సీరియల్స్ కూడా టాప్ 10 లో నిలుస్తాయి...ఇప్పుడు మరో కొత్త సీరియల్ ఈ ఛానల్ లో త్వరలో ప్రసారం కాబోతోంది. అదే "మా వారు మాష్టారు" జూన్ 12 నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30 గంటలకు   ప్రసారం కావడానికి రెడీ ఐపోయింది.  "అమ్మ ఆశయం కోసం ఆడిన అబద్ధం.. అగాధంలా మారితే.?" అనే టైటిల్ తో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ శ్రీవిద్యకు చదువు అంటే ఎంతో ఇష్టం.

కానీ వాళ్ళ అమ్మ చనిపోవడం వలన ఆమె చదువుకోలేకపోతుంది. ఎలాగైనా పెద్ద చదువులు చదవాలని ఆశ పడుతుంది. చదివించే వాడి కంటే చదువు చెప్పే వాడు భర్తగా వస్తే తన కల నెరవేరుతుంది అని ఆశపడుతోంది. అందుకే ఎలాగైనా ఒక టీచర్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. తన కోరిక నెరవాలి అంటే తనకు గణపతి మాష్టర్ తగిన వాడు అని నమ్ముతుంది. ఐతే గణపతి తండ్రి ఒక టీచర్. తన కొడుకు కూడా అలాగే టీచర్ కావాలని ఆశ పడుతుంది గణపతి తల్లి.

కొన్ని కారణాల వలన తాను టీచర్ ని అంటూ  తల్లికి అబద్దం చెప్తాడు గణపతి. కానీ గణపతి స్కూల్ లో ప్యూన్ అన్న విషయం తెలీదు. గణపతి చెప్పిన అబద్ధంతో అతని జీవితం ఎలా మలుపు తిరుగుతుంది ?  శ్రీవిద్య గణపతి గురించిన నిజం తెలుసుకుని ఏం చేస్తుంది ? కొడుకు టీచర్ అని సంతోషపడే పార్వతికి నిజం తెలిసిందా ? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే  "మావారు మాస్టారు", సీరియల్ ని జీ తెలుగులో చూడాల్సిందే. ఈ కొత్త సీరియల్ పట్టాలెక్కేసరికి  మిగతా సీరియల్స్ ప్రసార సమయాల్లో మార్పులు జరిగాయి. ఇకనుంచి  మిఠాయికొట్టు చిట్టెమ్మ మధ్యాహ్నం 12 గంటలకు, రాధకు నీవేరా ప్రాణం మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం అవుతాయి.