English | Telugu

లవ్ యు అమ్మ అంటున్న సెలబ్రిటీస్!

ఈ సృష్టిలో అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మనకు తెలిసిన అన్ని ముఖ్య సంబంధాలలో ఓ గొప్ప అనుబంధమే తల్లీబిడ్డల సంబంధం. అలాంటి స్పెషల్ ఈవెంట్ రోజున ఫేమస్ సెలబ్రిటీస్ ని తీసుకురాబోతోంది స్టార్ మా... బుల్లితెర మీద మదర్స్ డే సెలబ్రేషన్ ఈవెంట్స్ ఇప్పటికే మొదలయ్యాయి. "లవ్ యు అమ్మ" అనే ఒక ఈవెంట్ మే 14 న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది. ఇందులో ఎంతో మంది సెలబ్రిటీస్ వాళ్ళ వాళ్ళ అమ్మలను తీసుకొచ్చారు. పాటలు పాడారు, డాన్స్ చేశారు, వాళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పుకుని బాధపడ్డారు.

జానకి కలగనలేదు సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్, కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ, బీబీ జోడి కంటెస్టెంట్ ఆర్జే సూర్య, గుప్పెడంత మనసు నుంచి రక్షా గౌడ , ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ నుంచి శివ్ కుమార్ వాళ్ళ వాళ్ళ అమ్మలతో, సుష్మకిరణ్ వాళ్ళ అబ్బాయితో, ప్రభాకర్ భార్య మలయజ తన కూతురు దివిజాతో, భావన తన కూతురితో, అవినాష్ వాళ్ళ అమ్మతో అలాగే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ డైరెక్టర్ నందిని రెడ్డి వాళ్ళ అమ్మతో, కృతి శెట్టి వాళ్ళ అమ్మతో వచ్చారు. "ఐ లవ్ యు అమ్మ" అంటూ ప్రియాంక జైన్ ముద్దు పెట్టి చెప్పింది. "నా నిక్ నేమ్ ఏంటో తెలుసా రాక్షసి" అని చెప్పింది ప్రేరణ. "వేలు పట్టి అక్షరాలు నేర్పించినదగ్గర నుంచి చెయ్యి పట్టుకుని బతకడం నేర్పించినంతవరకు ప్రతి క్షణం తోడు ఉండేది అమ్మ. అలాంటి అమ్మకు ఎం చెప్పగలం" అంటూ ఈ షోకి హోస్ట్ చేసింది శ్రీముఖి. ఈ సంవత్సరం మదర్స్ డేని స్టార్ మా ఇలా సెలెబ్రేట్ చేస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.