English | Telugu
రేపే బిగ్ బాస్-5 ప్రారంభం.. కంటెస్టెంట్స్ పైనల్ లిస్ట్ ఇదే!!
Updated : Sep 4, 2021
బుల్లితెరపై బిగ్ బాస్ షో మరోసారి సందడి చేయబోతోంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఆదివారం ప్రారంభం కానుంది. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. అయితే ఈసారి హౌస్ లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ ఎవరా అని గత కొంతకాలంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేపటి నుంచి షో ప్రారంభం కానున్న నేపథ్యంలో సీజన్ 5లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరేనంటూ సోషల్ మీడియాలో ఓ లిస్టు వైరల్ అవుతుంది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరేనంటూ ఓ లిస్టు చక్కర్లు కొడుతోంది. యాంకర్ రవి, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, యూట్యూబర్ సరయు, నటి శ్వేతా వర్మ, సీరియల్ నటి ప్రియ, లహరి, ఉమా దేవి, సీరియల్ నటుడు మానస్, రేడియో జాకీ కాజల్, సింగర్ శ్రీరామచంద్ర, యాక్టర్ విశ్వ పేర్లు లిస్టులో ఉన్నాయి. ఈ లిస్టు నిజమో కాదో అనేది రేపు తేలనుంది.
బిగ్ బాస్ షో తెలుగు మొదటి నాలుగు సీజన్లు బుల్లితెర ప్రేక్షకులను అలరించాయి. మరి ఐదో సీజన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.