English | Telugu

నా మొదటి మెమోరెబుల్ ట్రిప్ టూ ఇటలీ!

దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీకి మొదటగా ఒక మోడల్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో వెండి తెర పై మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. అలా నక్క తోక తొక్కినట్లు వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది.

దివి వాద్య ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో చేసి మెప్పించింది. తాజాగా వచ్చిన 'భోలా శంకర్' మూవీలో నటించింది.. ఈ సొట్ట బుగ్గల సుందరి. అయితే దివి కొంతకాలం నుంచి తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్ పెడుతూ యూత్ ని ఆకర్షిస్తోంది. అలా తను ఎప్పటికప్పుడు హాట్ ఫోటోస్ తో ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తుంది ఇటీవల జీ-5లో విడుదలైన 'ఏటీఎమ్' వెబ్ సిరీస్ లో నటించింది దివి.

అందాల ఆరబోతలో దివి తర్వాతే మరొకరని చెప్పొచ్చు.‌ ఎందుకంటే ఎప్పుడు చూసినా బోల్డ్ ఫొటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఈ అమ్మడు. దివి తాజాగా ఇటలీ వెళ్లిందట.. అది తన మెమోరెబుల్ మూమెంట్ అంట. దివి విదేశాలకి వెళ్ళటం కొత్తేమీ కాదు.. ఎప్పుడు ఏదో ఒక టూర్ అంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటుంది. ' నా మొదటి మొమొరెబుల్ ట్రిప్ టూ ఇటలీ' అని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దివి. కాగా ఇప్పుడు ఈ వీడియోకి అటు పాజిటివ్ కామెంట్స్, ఇటు నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దీంతో దివి ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.