English | Telugu

పాగల్ పవిత్ర ముఖం కప్పలా ఉంటుంది!

లేడీస్ అండ్ జెంటిల్ మెన్ షో ప్రతీ వారంలాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేయడానికి వస్తోంది. ఇక ఈ వారం రాబోయే షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో పవిత్ర-భాస్కర్, తాగుబోతు రమేష్- కెవ్వు కార్తిక్, అదిరే అభి-సునామి సుధాకర్ జోడీస్ గా వచ్చారు. "పవిత్రను ముద్దుగా ఏమని పిలుస్తావ్" అని ప్రదీప్ బులెట్ భాస్కర్ ని అడిగేసరికి "కప్పకు మానవ రూపం ఇస్తే ఎలా ఉంటుందో పవిత్ర అలా ఉంటుంది" అని పంచ్ వేసాడు. "పాలకూర పప్పు..పవిత్ర నిప్పు" అంటూ ఆడియన్స్ పవిత్ర మీద డైలాగ్ వేశారు. దానికి పవిత్ర "నా పక్కన ఉంది తుప్పు" అంటూ భాస్కర్ కి అదిరిపోయే రివర్స్ పంచ్ వేసేసింది.

వీళ్ళ తర్వాత తాగుబోతు రమేష్- కెవ్వు కార్తిక్ ఎంట్రీ ఇచ్చారు. తాగుబోతు రమేష్ గారు షోకి కూడా హెల్మెట్ తో వచ్చారు అనేసరికి ఒక్కసారి షాకయ్యాడు. "మీ టీ షర్ట్ మీద ఉంది హెల్మెట్" అనేసరికి అందరూ నవ్వేశారు. తాగుబోతు రమేష్ అన్నకు చాల అన్యాయం జరిగింది ఎందుకంటే "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కి నంది అవార్డు వచ్చింది.. కానీ ఆయనకు పునాది రాళ్లు సినిమాకు రావాలి" అని బులెట్ భాస్కర్ అనేసరికి రమేష్ నోరెళ్లబెట్టాడు. దాంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో "ముసలి తాత ముడత ముఖం" ప్లే చేశారు. తర్వాత అభి-సునామి సుధాకర్ ఎంట్రీ ఇచ్చి 'నాటు నాటు' సాంగ్ కి నాగార్జున-అక్కినేని నాగేశ్వరావు స్టెప్స్ వేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించారు.

తర్వాత కంటెస్టెంట్స్ కి మస్కిటో కాయిల్స్ ఇచ్చి విరగకుండా సెపరేట్ చేయమని టాస్క్ ఇచ్చాడు ప్రదీప్. "ఎంత శాతం మంది మగవాళ్ళు తల్లో రెండు సుడులు ఉన్నవాళ్లు రెండు పెళ్లిళ్లు అవుతాయని నమ్ముతారు" అని ప్రదీప్ అడిగేసరికి "చేసుకోవాలనే ఆలోచన ఉండాలి కానీ సుడులతో పని లేదు" అని చెప్పాడు భాస్కర్. "మీకెప్పుడైనా అనిపించిందా అర్రే ఇంకొక్క సుడి ఉంటె బాగుండు అని" రమేష్ ని అడిగాడు. "ఉంటే బాగుండు..కనీసం రెండన్నా" అని రమేష్ ఆన్సర్ చెప్పేలోపు "మీకు సుడి లేకపోయినా ఇంటికెళ్ళాక వచ్చేస్తుంది" అని కామెడీగా కౌంటర్ వేసాడు ప్రదీప్. ఇలా రాబోయే వారం ఈ షో అలరించడానికి రాబోతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.