English | Telugu

హీరో ముఖానికి సర్జరీ.. గుర్తు పట్టని భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -296 లో.. మురారి గురించి కృష్ణ హాస్పిటల్ లో వెతుకుతుంటుంది. కృష్ణతో ఉన్న ప్రభాకర్.. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని కృష్ణని తీసుకొని వెళ్తాడు. మరొక వైపు ముకుంద టెన్షన్ పడుతుంది. " ఏం జరుగుతుంది అసలు, ఒక వైపు బ్రతికి ఉన్న మురారికి కర్మకాండ అంటున్నారు. మరొక వైపు చనిపోయింది అనుకున్న కృష్ణ మురారి కోసం వెతకడం ఏంటి " అని ముకుంద టెన్షన్ పడుతుంది.

ఆ తర్వాత నేను చేస్తుంది తప్పని తెలుసు కానీ ఏం చెయ్యాలని ముకుంద ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు మురారి గురించి రేవతి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మురారి కర్మకాండకి సంబంధించినవి తీసుకొని‌ మధు వస్తాడు. మరొక వైపు కృష్ణ హాస్పిటల్ లో మురారి గురించి పిచ్చిదానిలాగా వెతుకుతుంటుంది. కృష్ణ అలా వెతకడం చూసిన ప్రభాకర్ బాధపడుతు ఉంటాడు. ఆ తర్వాత ప్రభాకర్ ఫోన్ తీసుకొని మురారి గురించి తెలుసుకోమని చెప్తూ ఉంటుంది కృష్ణ. మరొక వైపు మురారి కీ ఫేస్ కి సర్జరి చేసి కట్లు విప్పుతు ఉంటారు డాక్టర్లు‌. వాళ్లకి ఎదరుగానే కృష్ణ ఉంటుంది.. ఆ తర్వాత మురారికి కట్లు విప్పడం కృష్ణ చూస్తుంది. కానీ మురారకి మొహం చేంజ్ అవడంతో కృష్ణ తనని గుర్తుపట్టులేకపోతుంది.

ఆ తర్వాత మురారి తన మొహాన్ని అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. డాక్టర్స్ మురారి గురించి అడుగుతారు. కానీ మురారి ఏం సమాధానం చెప్పలేక పోతాడు. ఆ తర్వాత డాక్టర్స్ మురారి గురించి మాట్లాడుకుంటారు. మురారి గతం మర్చిపోయాడు జాగ్రత్తగా చూసుకోవాలని డిస్కషన్ చేసుకుంటారు. మరొకవైపు ముకుంద హాస్పిటల్ కి వస్తుంది. కృష్ణ చనిపోయింది కదా అని పరిమళ ఉన్న హాస్పిటల్ కి మురారిని తీసుకొని వెళ్ళామని చెప్పాను కానీ కృష్ణ బ్రతికే ఉంది. మురారిని చూస్తుందా అని ముకుంద అనుకుంటుంది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని ముకుంద అనుకుంటుంది. మరొక వైపు కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. అలా రావడం చూసిన కృష్ణ ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.