English | Telugu

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. అతని ఓవరాక్షన్‌ కొంపముంచింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి' (Krishna Mukunda Murari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -473 లో.. కృష్ణ దగ్గరకు భవాని కంగారుగా వచ్చి.. మన మీరా ఉంది కదా. తను నెల తప్పిందని అంటుంది. పెద్దత్తయ్యకు ఈ విషయం ఎలా తెలిసింది. కొంపతీసి సరోగసీ గురించి తెలిసిపోయిందా అని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పినా అందరికీ చెప్పి హడావుడి చేస్తారు. అందుకే నీతో చెప్పాను. ఇది నాకు అనుమానం కాదు. కన్ఫ్మమ్‌గా చెప్తున్నాను. మనం అందరం భోజనం చేసినప్పుడు వాంతులు చేసుకుంది కదా. కానీ ఆదర్శ్‌ ఓవరాక్షన్‌ చూశావా. ఏమైనా ఉంటే నాకు చెప్పొచ్చు కదా అని మనకు అర్థం కాకుండా మాట్లాడాడని భవాని అంటుంది.

మీరా గర్భవతి అవ్వడానికి ఆదర్శ్‌ కారణం కాదు. అసలు ఆ సంగతే ఆదర్శ్‌కి తెలీదు. అది కాదు వాళ్ళకింకా పెళ్లి కాలేదు కదా పెద్దత్తయ్య అని కృష్ణ అనగానే.. పెళ్లి కానట్లు ఉంటున్నారా వాళ్లు. ఆదర్శ్‌ ఒక్క నిమిషం మీరాని వదలడం లేదు. మీరా కూడా వాడి వెంటే తిరుగుతుంది. మీరాకి ఆదర్శ్‌ అంటే ఇష్టం అని లేటుగా తెలిసింది. లేదంటే ఎప్పుడో ముహూర్తాలు పెట్టించేదాన్ని అని భవాని అంటుంది. కృష్ణ ఆలోచిస్తుంటుంది. అది ప్రెగ్నెంట్ అని తేలితే నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానో తనని కూడా అలాగే చూసుకోవచ్చు అని నీకు టెస్ట్ చేయమని చెప్తున్నా. నాకు ఎందుకో పాజిటివ్‌ వస్తుందని అనిపిస్తుంది. నీకు మురారికి బిడ్డ పుట్టబోతుంది. ఆదర్శ్‌కి మీరాకి మరో శుభం జరిగితే ఇంట్లో అన్నీ శుభాలే. అందుకే రేపు టెస్ట్ చేయు. టెస్ట్ అని తనకు చెప్పకు ఏదో ఒక టెస్ట్ అని చేయు. ఇక వీళ్ళిద్దరి మాటలు మీరా వింటుంది. నీకు షాక్ ఇస్తా చూడు కృష్ణ అని వీళ్ళు మాట్లాడుకున్నదంతా మురారి దగ్గరికి వెళ్ళి చెప్తుంది. దాంతో కృష్ణ దగ్గరికి మురారి వెళ్ళి చెప్పొద్దని కన్విన్స్ చేస్తాడు‌. ఇక మరోవైపు మీరా కోసం ఆదర్శ్ తన గదికి వెళ్తాడు.

మీరా జాగింగ్ డ్రెస్ అలానే ఉందని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుందని మురారి వాళ్ళని అడగడానికి ఆదర్శ్ వెళ్తాడు. రాత్రి నుంచి ముకుంద ఇంట్లో లేదని ఆదర్శ్ చెప్పగానే.. కృష్ణ, మురారిలు షాక్ అవుతారు. ఇంతలో నందూ వస్తుంది. నందూని చూసిన కృష్ణ అందర్ని మేనేజ్ చేయొచ్చు కానీ నందూని మేనేజ్ చేయలేమని అంటుంది. నందిని కృష్ణని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తుంది. మరోవైపు మీరా గురించి ఆదర్శ్ టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో కృష్ణకు మీరా కాల్ చేస్తుంది. కృష్ణ, మురారిలను రెస్టారెంట్‌కు రమ్మని మీరా పిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో‌ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.