English | Telugu

Krishna Mukunda Murari: పెళ్ళికాకుండానే ప్రెగ్నెంట్ అయిన మీరా.. తనకి అంతా తెలిసిపోయిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -466 లో.. సరోగసీ ప్రోసెస్ కోసం కృష్ణ, మురారి ఇద్దరు ఆసుపత్రికి వెళ్తారు. అప్పుడే అటుగా వెళ్తున్న మీరాని చూసిన మురారి.. ప్రాసెస్ తెలుసుకోమని కృష్ణని పంపించేస్తాడు. కృష్ణ వెళ్ళాక మీరా దగ్గరికి వస్తాడు మురారి.

మురారి గారు.. అనాథని అని.. అద్దె గర్భం మోస్తున్నానని.. మీరు నాకు వెల కట్టరు కదా అని మీరా అంటుంది. అయ్యో ఎంత మాట.. ఈ ప్రపంచంలో వెల కట్టలేనివి.. విలువైనవి కొన్ని ఉంటాయి.. అందులో మీరు ఒకరని మురారి అంటాడు. దాంతో మీరా పొంగిపోతుంది. కృష్ణకు కనిపించకుండా తను కూడా ప్రాసెస్ కోసం డాక్టర్‌ని కలుస్తుంది. కృష్ణ, మురారీలను బయటుంచి.. మీరా కడుపులో బిడ్డకు సంబంధించిన అండాన్ని ప్రవేశపెట్టే ప్రాసెస్ ని డాక్టర్ వైదేహి పూర్తిచేస్తుంది. దాంతో ముకుంద పొంగిపోతుంది. థాంక్యూ వైదేహి.. నీకు నేను ఏం ఇచ్చినా సరిపోదు. నా మురారి ప్రతిరూపం నా కడుపులో పెరుగుతోంది. ఈ సంతోషం మాటల్లో చెప్పలేనంటూ మీరా పొంగిపోతుంది. ఇంతలో కృష్ణ.. చాటుగా సరోగసి మదర్‌ని చూడాలని అనుకుంటూ మీరా ఉన్న రూమ్ వైపు వస్తుంటుంది. అయితే కృష్ణకు వైదేహి ఎదురుగా వెళ్లి.. ఏంటి మీరు చేస్తున్న పని అని తిట్టేస్తుంది. మీ భార్యను తీసుకుని వెళ్లండి. ఇక ఆవిడ పని లేదని మురారీతో చెప్పి పంపేస్తుంది.

ఇక కృష్ణ, మురారి ఇంటికొస్తారు. వారిని చూసిన భవాని అంతా ఒకేనా అడుగగా.. ఓకే అని వాళ్ళు అంటారు. ఇక ఎప్పటిలాగే రజిని, కృష్ణ మాట్లాడుకుంటారు. ఇక పూజా ఏర్పాట్లు జరుగుతుంటాయి. కృష్ణ, మురారి, మీరా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి రెడీ అవుతారు.‌ ఇక తరువాయి భాగంలో పూజ జరుగుతుండగా మీరా కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో అందరు తనని గదిలోకి తీసుకెళ్తారు. ఇక మీరా నాడిని చూసిన కృష్ణ.. తను ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటుంది. ఇక భవాని స్నేహితురాలు అమృత కూడా మీరా నాడిని చెక్ చేస్తుంది. ఆమె కూడా షాక్ అవుతుంది. మరి కృష్ణ నిజం బయటికి చెప్పలేదు కాబట్టి అమృత ఆగుతుందా? నిజం చెప్పేస్తుందా? అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.