Read more!

English | Telugu

Krishna Mukunda Murari : సరిగ్గా ఆలోచించండి ఏసీపీ సర్.. ఆ అమ్మాయిని రప్పించింది నువ్వే కదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -460 లో....   కృష్ణ ప్రెగ్నెంట్ అని  భవాని, రేవతి అనుకొని గ్రాంఢ్ గా పార్టీ చేసుకుంటారు. అయితే అదే సమయంలో ఓ ఆవిడ వచ్చి సరోగసి కోసం ప్రయత్నిస్తున్నారంట ఎవరు అని అడుగుతుంది. దాంతో కృష్ణ, మురారి అవాక్కవుతారు. 

ఇక అదే సమయంలో ఇంటికి వచ్చిన ఆ అమ్మాయిని చూసి.. నీ కోడలు పిల్లలు పుట్టక.. సరోగసి కోసం ప్రయత్నిస్తోంది కాబోలు భవాని అంటు సరస్వతి, సుచిత్రలు అవమానకరంగా మాట్లాడతారు. వాళ్ళ‌ మాటలు విని కృష్ణ బాధపడుతుంటే.. అది చూసి ఆదర్శ్ సంబరంగా చూస్తాడు. ఇక మీరా కోపంగా.. మీరంతా ఆపుతారా.. అమ్మాయి నువ్వు ఏ అడ్రస్‌కి వచ్చావ్ ఇటు ఇవ్వు అంటూ నాటకం స్టార్ట్ చేస్తుంది. ఇది రాంగ్ అడ్రస్ మేడమ్.. తను తప్పు అడ్రస్‌కి వచ్చిందంటూ కవర్ చేసి.. ఆ అమ్మాయిని పంపించేస్తుంది.. కృష్ణ వెంటనే టెన్షన్‌తో అదే కూర్చీలో కూలబడిపోతుంది. మురారీ ఓదార్పుగా చూస్తాడు. భవానీ దేవితో సహా అంతా ఆ అమ్మాయి వెళ్లిపోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. విన్నారా నా కోడలు కడుపుతో ఉన్న మాట వాస్తవం. ఆ అమ్మాయి ఎవరో తప్పు అడ్రస్‌కి వచ్చిందట అని సరస్వతి, సుచిత్రలకు బుద్ది చెప్తుంది భవాని. కోడలు కృష్ణను మరోసారి ముద్దాడి ప్రేమగా చూసుకుంటుంది‌ భవాని. ఆ ప్రేమను తట్టుకోలేక కృష్ణ బాధపడుతుంది. కాసేపటికి కృష్ణ, మురారీ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏసీపీ సర్.. డాక్టర్ వైదేహి మనతో ఏం చెప్పింది.. అద్దెగర్భం ఇచ్చే అమ్మాయి రహస్యంగా ఉండాలి. అది మేము బయటకు చెప్పం అని చెప్పింది కదా అని కృష్ణ అంటుంది. సరిగ్గా ఆలోచిస్తే ఇది ఎవరో కావాలనే చేసినట్లు ఉంది ఏసీపీ సర్.. మన కుటుంబం మీద పగ ఉన్నవారు. మనల్ని ఇబ్బంది పెట్టాలనుకునేవారు.. అలాగే మనం సరోగసికి ప్రయత్నిస్తున్నామని తెలిసి వాళ్లే ఈ పని చెయ్యగలరు. అయినా ఈ విషయం తెలిసింది కేవలం మీరు, నేను, వైదేహి డాక్టర్ అంతే కదా? అద్దె గర్భం ఇచ్చే అమ్మాయి రహస్యంగా ఉండటం అంటే.. అది అందరి విషయంలోనూ అవ్వాలి కదా.. అడ్రస్ పట్టుకుని రావడమేంటని కృష్ణ అంటుంది.

ఇక కృష్ణ మాటలని విన్న మురారీ బాగా ఆలోచిస్తాడు. ఈ విషయం మీరాకి తప్ప ఎవరికీ తెలియదని మురారి గుర్తుచేసుకుంటాడు. ఇక తరువాయి భాగంలో మీరాని కలవాలని చెప్తాడు మురారి. నిజం చెప్పు ముకుందా.. సరోగసి విషయం ఆ అమ్మాయికి నువ్వే చెప్పి రప్పించావ్ కదా అని సూటిగా నిలదీస్తాడు. దాంతో మీరా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.