English | Telugu

Karthika Deepam2 : పారిజాతానికి వార్నింగ్... బంటూని దీప కనిపెట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'.. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -20 లో.. దీపని తీసుకొని కార్తీక్ ఇంటికి వస్తాడు. కార్ డోర్ కూడా దీపకి తియ్యడం రాకపోతే కార్తీక్ డోర్ తీస్తాడు. దీంతో దీప కోపంగా కార్ దిగి వెళ్ళిపోతుంది. అలా కార్తీక్ కార్ తియ్యడం పారిజాతం చూసి ఉడికిపోతుంది. ఆ తర్వాత కార్తీక్ లోపలికి వస్తాడు. శివనారాయణ అప్పుడే కార్తీక్ జ్యోత్స్న ల పెళ్లి గురించి మాట్లాడతాడు. నాకు పెళ్లి ఇష్టం లేదని ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదా అన్నట్లు పారిజాతం వైపు కార్తిక్ చూస్తాడు.

ఆ తర్వాత పారిజాతం దీప దగ్గరికి వెళ్లి.. నా మనవడి కార్ లో ఎందుకు వచ్చావ్? వాడు వచ్చి డోర్ తీస్తే గాని దిగరా మేడమ్ గారు అంటూ దీపపై విరుచుకుపడుతుంది. అసలేం జరిగిందో తెలియకుండా మాట్లాడకండని దీప అంటుంది. ఎవరు ఎలాంటి వారో చూసి చెప్పొచ్చని దీపతో చీప్ గా మాట్లాడుతుంటే.. దీపకు కోపం వస్తుంది. మీరు నోటిని అదుపులో పెట్టకుంటే నా చెయ్యిని తిప్పాల్సి వస్తుందని దీప అనగానే.. పారిజాతం బయపడి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కార్తీక్ నర్సింహా అన్న మాటలు గుర్తుకుచేసుకొని దీప వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. శౌర్యతో కార్తిక్ ప్రేమగా మాట్లాడుతు.. నీ గురించి చెప్పు మీ అమ్మ ఏం చేస్తుందంటూ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటడు. మా నాన్న కోసం మేమ్ ఇక్కడికి వచ్చామని శౌర్య చెప్తుంది. మా నాన్న ఎలా ఉంటాడో తెలియదని శౌర్య అంటుంది.

ఆ తర్వాత నా వల్ల వాళ్లకి అన్యాయం జరిగిందనుకున్నాను కానీ జీవితం అన్యాయం అయిపోయిందని కార్తీక్ బాధపడతాడు. అప్పుడే దీప కోపంగా వచ్చి శౌర్యని లాక్కొని వెళ్తుంది. నువ్వేంటి అతనితో అలా మాట్లాడుతున్నావంటూ శౌర్యపై దీప కోప్పడుతుంది.ఇక ఇక్కడ ఉండొద్దని సుమిత్రకి చెప్పడానికి దీప వెళ్తుంది కానీ దీప ని చెప్పనివ్వకుండా.. జ్యోత్స్న బర్త్డే కి అన్ని వంటలు నువ్వే చెయ్యాలని సుమిత్ర చెప్తుంది. దాంతో దీప సరే అంటుంది. ఆ తర్వాత దీపని చూసిన బంటు టెన్షన్ పడుతుంటాడు. నువ్వు ఎందుకు నన్ను చూసి బయపడుతున్నావని బంటుని దీప అడుగుతుంది. అదేం లేదంటూ బంటూ కంగారుగా వెళ్ళిపోతాడు. ఇతన్ని ఎక్కడ అయిన చూసానా? ఎందుకు బయపడుతున్నాడని దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.