English | Telugu
మురారి లేడనే విషయం కృష్ణకి తెలియనుందా.. ప్రభాకర్ ఏం చేయనున్నాడు?
Updated : Oct 22, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -294 లో.. ప్రభాకర్ ఫోన్ చెయ్యగానే మధు బయటకు వచ్చి ఎందుకు వచ్చావని అడుగుతాడు. మురారి ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడా? అని ప్రభాకర్ అడగ్గానే.. లేదు మామయ్య అంటూ మధు జరిగింది మొత్తం చెప్తాడు. మురారి చనిపోయాడు మామయ్య అని మధు చెప్పగానే ప్రభాకర్ షాక్ అవుతాడు.
ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు అసలేం జరిగింది? కృష్ణ ఎక్కడ ఉందని, కృష్ణపై చాలా కోపంగా ఉన్నారని మధు చెప్తాడు. కృష్ణ హాస్పిటల్ లో ఉందని చెప్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందని కృష్ణని మీరే ఇంటి నుండి పంపించేశారు కదా అని ప్రభాకర్ అంటాడు. ఆ తర్వాత ప్రభాకర్ బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అసలు ఈ విషయం కృష్ణకి ఎలా చెప్పాలి అని ప్రభాకర్ అనుకుంటాడు. అలాగే అనుకుంటూ ప్రభాకర్ హాస్పిటల్ కి వస్తాడు. ఏమైంది అల్లుడి జాడ దొరికిందా అని శకుంతల అడుగుతుంది. ప్రభాకర్ ఏం చెప్పలేక సైలెంట్ గా ఉంటాడు. అయినా శకుంతల మళ్ళీ మళ్ళీ అడిగేసరికి ప్రభాకర్ మధు చెప్పింది మొత్తం శకుంతలకి చెప్తాడు. శకుంతల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ విషయం మన కృష్ణకి తెలియవద్దని ఇద్దరు అనుకుంటారు. కాసేపటికి ఏసీపీ సర్ ఎక్కడ ఉన్నారో, అయినా చిన్నాన్న వెళ్ళాడు కదా, ఎలాగైనా ఏసీపీ సర్ ని తీసుకొని వస్తాడని కృష్ణ అనుకుంటుంది. అప్పుడే ప్రభాకర్, శకుంతల ఇద్దరు వస్తారు. ఏసీపీ సర్ గురించి తెలిసిందా అని కృష్ణ అడుగుతుంది. కాసేపటికి డాక్టర్ దగ్గరికి వచ్చి చెకప్ చేస్తుంది.
ముకుంద వాళ్ళ అన్నయ్య ముకుందకి ఫోన్ చేసి మురారి గురించి అప్డేట్ ఇస్తుంటాడు. మరొకవైపు కృష్ణ హాస్పిటల్ కి వచ్చి మురారి గురించి చూస్తుంది. మురారి గురించి తన చిన్నాన్న, పిన్నికి చెప్తుంటుంది. అప్పుడే ముకుంద వాళ్ళ అన్నయ్య.. కృష్ణ ముందు నుండి మురారిని తీసుకొని వెళ్తాడు. నాకు ఎందుకో ఏసీపీ సర్ ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుందని శకుంతలతో కృష్ణ చెప్తుంది. మరొక వైపు ముకుంద వాళ్ళ అన్నయ్య పరిమళతో మురారి ట్రీట్ మెంట్ గురించి మాట్లాడుతాడు. పరిమళకి మురారి అన్న విషయం తెలియదు. కృష్ణ హాస్పిటల్ లో మురారి గురించి వెతుకుతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.