English | Telugu

Krishna Mukunda Murari:కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కీలక మలుపు.. దేవ్ దొరికేసాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -361 లో.. కృష్ణని ఇంట్లో నుండి బయటకు వెళ్ళమని భవాని చెప్తుంది. దాంతో కృష్ణ బాధపడుతు వెళ్లి పోతుంటే.. వెనకాలే మురారి వచ్చి కృష్ణతో మాట్లాడతాడు. పెద్దమ్మ అన్న మాటలకు బాధగా ఉందా అని మురారి అంటాడు. నన్నేం అన్న పర్లేదు కానీ మిమల్ని ఎవరైనా అంటే ఊరుకోనని కృష్ణ అంటుంది. అసలు మన వెనకాల జరిగేది కుట్రనా? నిజమేనా అని కృష్ణ అనగానే ముమ్మాటికీ ఇది కుట్రనే అని మురారి అంటాడు.

ఆ తర్వాత మురారి ఒక అతనికి ఫోన్ చేసి కేసు గురించి ఎంక్వయిరీ చేస్తాను. రింగ్ ఎక్కడ తీసుకున్నారో సీసీటీవీ ఫుటేజ్ ని చూడండి అని మురారి చెప్తాడు. ఆ తర్వాత కృష్ణ తన చిన్నాన్నని కలిసి వస్తానంటు జైలుకి వెళ్తుంది. అక్కడ తనని కలవడానికి జైలర్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంది. మరొక వైపు ముకుంద పెళ్లి కోసం చేతుకి మెహంది పెట్టుకుంటుంది. అదేసమయంలో కృష్ణ, శంకుతల ఇద్దరు బాధపడుతు ఉంటారు. అప్పుడే వాళ్ళ దగ్గరకి మురారి వస్తాడు. కాసేపటికి రేవతి , నందు లు కూడా వస్తారు. కృష్ణని చూసి రేవతి ఎమోషనల్ అవుతుంది. జరుగుతున్న సిచువేషన్ చూసి ఏమైన చేసుకుంటుందేమోనని భయంతో వచ్చాను. నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి కృష్ణ. నువ్వు లేకుండా నేను ఉండలేనని రేవతి అనగానే.. కృష్ణ ఎమోషనల్ గా వచ్చి రేవతిని హగ్ చేసుకొని ఏడుస్తుంది. అ తర్వాత పిన్ని ప్రొద్దున నుండి భోజనం చెయ్యలేదని నందు అంటుంది. నువ్వు రా కృష్ణ అని రేవతి పిలుస్తుంది. నేను కృష్ణని తీసుకొని వస్తాను మీరు వెళ్ళండి అని మురారి చెప్తాడు. అ తర్వాత మురారి కృష్ణని తీసుకొని ఇంట్లోకి వస్తాడు. ముకుంద మెహందీ పెట్టుకోవడం చూసి నేను రేపటి నుండి మీ మాజీ భార్యనా అని కృష్ణ అనగానే అలా అనకంటూ మురారి బాధపడుతాడు.

మరొకవైపు పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే.. దేవ్ వచ్చి చేసేదే తప్పు పని దానికి ఏర్పాట్లలో మాట రావద్దని అంటున్నారు అని దేవ్ అనగానే భవాని కోప్పడతుంది. ఆ తర్వాత పెద్ద పల్లి ప్రభాకర్ ని బయటకు తీసుకొని వస్తానని కృష్ణకి దేవ్ మాట ఇస్తుంటే కృష్ణ రింగ్ చూసి శ్రీధర్ ని చంపింది తనే అని దేవ్ కాలర్ పట్టుకొని అడుగుతుంది. ఆ తర్వాత రింగ్ ని మురారికి చూపిస్తుంది. మురారి కూడ దేవ్ ని నిలదీస్తాడు. అప్పుడే పరిమళ మేడమ్ పోలీసులతో ఇంటికి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని వచ్చామని అనగానే అవసరం లేదు ఇదంతా నేను ముకుంద హ్యాపీగా ఉండడం కోసం చేశానని దేవ్ ఒప్పుకుంటాడు. ఈ విషయం ముకుందకి తెలియదు అని దేవ్ అంటాడు. ఎందుకు ఇంత పని చేసావ్ అని ముకుంద ఏం తెలియనట్లు అడుగుతుంది.. అందురు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.