English | Telugu
పదిరోజులకే కృష్ణ నరకం చూపించిదన్న మురారి!
Updated : Jan 11, 2023
'కృష్ణ ముకుంద మురారి' ఇప్పుడు స్టార్ మా టీవి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ధారావాహిక. ఈ సీరియల్ ఎపిసోడ్-49లో కృష్ణ దగ్గరికొచ్చి మాట్లాడుతూ ఉంటుంది ముకుంద. "మురారి నీ భర్తే కదా. ఇంట్లో లేడు తెలుసా. ఎక్కడికి వెళ్ళాడు. కొంచెం కూడా టెన్షన్ లేదా?" అని ముకుంద కృష్ణని అడుగుతుంది. "నాకు లేని టెన్షన్ నీకెందుకు. మీ ఆయన గురించి నువ్వు ఆలోచించు. మా ఆయన గురించి నేను ఆలోచిస్తాను. అయినా అన్నీ చూసుకోడానికి ఆ పెద్దావిడ ఉంది కదా" అని కృష్ణ చెప్తుంది. అప్పుడే వాళ్ళిద్దరి దగ్గరికి భవాని వచ్చి "ఏం జరుగుతుందిక్కడ" అని అడుగుతుంది. "మురారిని వెతకడానికి నేను వెళ్తాను" అని ముకుంద చెప్తుంది. అప్పుడే వచ్చిన రేవతి "నువ్వు వెళ్ళడమేంటి ముకుంద?" అని అడుగుతుంది. "మురారిని వెతకాల్సిన వాళ్ళు వెతకకుండా ఉంటే ఇలానే ఉంటుంది. నీ కోడలిని వెళ్ళి వెతకమను రేవతి" అని భవాని అంటుంది. "ఈ చీకట్లో ఎలా వెతుకుతుంది అక్క" అని సమాధానమిచ్చింది రేవతి. "నాతో ఎవరినైనా తోడుగా పంపివ్వండి" అని కృష్ణ అడుగుతుంది. "ఎవ్వరు రారు.. మురారి కనపడితే వెంట తీసుకొని రా.. లేకపోతే రాకు" అని భవాని అంటుంది. ఆ తర్వాత కృష్ణ మురారిని వెతకడానికి వెళ్తుంది. మురారికి కాల్ చేస్తుంది రేవతి. "ఎక్కడున్నావ్ రా, మీ పెద్దమ్మ కృష్ణని ఇంట్లోంచి పంపించేసింది" అని చెప్తుంది రేవతి. ఆ తర్వాత కృష్ణని వెతకడానికి మురారి వెళ్తాడు.
కృష్ణని వెతికి కనిపెడతాడు మురారి. అక్కడ కృష్ణని చూసి "కృష్ణ..ఇక్కడ ఏం చేస్తున్నావ్?" అని అడుగుతాడు. "నిన్ను వెతికి తీసుకురమ్మంది మీ పెద్దమ్మ. నిన్ను తీసుకొచ్చేదాకా ఇంట్లోకి రానివ్వను అని అంది. ఇంత పెద్ద సిటీలో నిన్ను ఎలా వెతకాలో తెలియక, మా ఊరికి వెళ్ళిపోదామనుకున్నాను. బస్ ఛార్జ్ కి డబ్బులు లేక ఆగిపోయా" అని కృష్ణ అంటుంది. "సరే పదా.. ఇంటికి వెళ్దాం" అని మురారి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. మరోవైపు భవానీ ఇంకా కుటుంబసభ్యులంతా కృష్ణ, మురారి కోసం ఎదురుచూస్తుంటారు. అంతలో కృష్ణని తీసుకొస్తాడు మురారి. రేవతి జరిగిందంతా మురారికి చెప్తుంది.
ఆ తర్వాత బయట కృష్ణ, మురారి ఇద్దరు ఎవరి సెల్ ఫోన్ వారు చూసుకుంటూ ఒకరి గురించి ఒకరు సరదాగా మాట్లాడుకుంటారు. "గురువుగారు పది రోజులకే నాకు నరకం చూపించింది. ఇన్ని రోజులు ఎలా భరించారు" అని మురారి అంటాడు. "ఆయన గురించి కమీషనర్ గారి దగ్గరకి వెళ్ళి చెప్పి, తిరిగి జాబ్ వచ్చేలా చేస్తే కనీసం థాంక్స్ కూడా చెప్పకుండా, రివర్స్ లో ఇన్ని తిట్లు తిడతాడా నాన్న "అని కృష్ణ అంటుంది. "నాకైతే పక్కలో పాముని పెట్టుకున్నట్టు అనిపిస్తుంది" అని మురారి అంటాడు. "హలో ఏసీపి సర్.. ఏంటి నన్ను పగబట్టిన పాము అని అంటున్నారు" అని కృష్ణ అంటుంది. ఇలా కాసేపు ఒకరినొకరు తిట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.