English | Telugu

భార్య కృష్ణ కోసం పెద్దమ్మకే ఎదురుతిరిగిన మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -107లో.. కృష్ణ, మురారిలు ఎవరికి తెలియకుండా బయటకు వెళ్ళిన విషయం ముకుంద ఎలాగైనా భవానీతో చెప్పాలనుకుంటుంది. ఉదయం అందరూ బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా.. ఆ తింగరి పిల్లను వచ్చి తినమని చెప్పండి. అసలే నిన్నంతా పస్తులు ఉందని భవాని అంటుంది. అంత అవసరమేమీ లేదు పెద్ద అత్తయ్య.. రాత్రి కృష్ణని మురారి బయటికి తీసుకువెళ్ళి తినేసి వచ్చారని ముకుంద సమాధానమిస్తుంది. అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలోనే కృష్ణ, మురారిలు రెడీ అయి కిందకి వస్తారు. "మీరిద్దరు రాత్రి బయటికెళ్ళారా" అని భవాని అడిగేసరికి.. వెళ్ళామని మురారి చెప్తాడు. అంటే ఈ ఇంట్లో ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండరా? నా నిర్ణయనికి విలువ ఇవ్వరా అంటూ భవాని ప్రశ్నిస్తుంది. "కృష్ణ నా భార్య.. తను పస్తులుంటే నేనెలా తింటాను పెద్దమ్మ.. నేను తినలేదు‌. ఎంత కూలి చేసుకొని బ్రతికేవాడైన తన భార్యని పస్తులు ఉంచడు.

అలాగే నేను కూడా నా భార్యని పస్తులు ఉంచకూడదని బయటికి తీసుకెళ్ళాను" అని మురారి అంటాడు. నిన్న నీ భార్యని వేరొకరు ఇంటి దగ్గర డ్రాప్ చేసారు. దానికేమంటావని భవాని అనగానే. కృష్ణకి లేట్ అయితే సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చి దించి వెళ్ళినతనికి థాంక్స్ చెప్తానని మురారి అంటాడు. నాకు ఇన్ని రోజులుగా ఇంట్లో ఎవరు ఎదురు తిరగలేదు.. ఇప్పుడు నువ్వు నీ భార్యకి సపోర్ట్ చేసి నాకు ఎదురు మాట్లాడుతున్నావ్ అని భవాని అంటుంది. నేనెప్పుడు మీకు ఎదురు తిరగను. ఒక భర్తగా తను పస్తులు ఉండకూడదని బయటకి తీసుకువెళ్ళానని మురారి అంటాడు. అయినా సరే మీరు చేసింది తప్పు.. మీకు శిక్ష పడాలని భవాని అంటుండగానే.. నందు మెట్లమీద నుండి కిందపడి నోట్లో నుండి నురగలు కక్కుకుంటుంది.

ఇక వెంటనే హాస్పిటల్ కు వెళ్దామని కృష్ణ తను ట్రైనింగ్ తీసుకునే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. అక్కడ గౌతమ్ ఉంటాడు. గౌతమ్ తనని ఎవరు గుర్తు పట్టకుండా ఫేస్ ని కవర్ చేస్తూ.. నందు కి ట్రీట్ మెంట్ చేస్తాడు. అందరిని బయటికి వెళ్ళమని చెప్తాడు గౌతమ్. ఇంట్లో వాళ్ళు ఇన్ని రోజులు వాడినవి కరెక్ట్ టాబ్లెట్స్ కాదు కాబట్టే నేను ఇచ్చిన టాబ్లెట్స్ వాడితే ఇలా అయిందని కృష్ణతో చెప్తాడు గౌతమ్.

కృష్ణ బయటకు వస్తుంది. అక్కడే ఉన్న భవాని.. నీ వల్లే నందుకి ఇలా అయిందని తిడుతుంది. పక్కనే ఉన్న ముకుంద ఇదే మంచి టైం ఇంకా రెచ్చగొడదామని.. "ఇంట్లో ఎవరు ఏది చెప్పినా పట్టించుకోవు.. వద్దన్నదే చేస్తావ్" అని ముకుంద అంటుంది. దాంతో నేను చేసింది తప్పే, నన్ను క్షమించండని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.