English | Telugu

కాన్సర్ తో అమ్మ చనిపోయింది..కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ


తేజస్విని మడివాడ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన తేజస్వి తర్వాత ఎన్నో మంచి మూవీస్ తో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళింది. కానీ హౌస్ నుంచి వచ్చాక ఆమె మీద ఫుల్ నెగటివిటీ రావడంతో మూవీస్ లో కనిపించడం మానేసింది. ఐతే ఇప్పుడు యాంకరింగ్ చేస్తూ బుల్లితెర మీద కొన్ని షోస్ లో కనిపిస్తోంది. అదే కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ లో యాక్టీవ్ పార్టిసిపెంట్ గా ఉంది. కానీ ఈ వారం ఫ్యామిలీ థీమ్ లో ఆమె తన స్టోరీ చెప్పి అందరితో కన్నీళ్లు పెట్టించేసింది. జడ్జ్ అనసూయ కూడా కన్నీళ్లు పెట్టేసుకుంది. తనకు ఫుడ్ పెడుతున్న ఒక ఫ్యామిలీ నుంచి రోహిత్ భరద్వాజ్ అనే పర్సన్ ని షోలో పరిచయం చేసింది. అప్పుడు తన ఫామిలీ గురించి చెప్పింది.

షోస్ లో చిటపటమంటూ ఉంటుంది తేజు ఇంట్లో ఎలా ఉంటుంది అని రోహిత్ ని శ్రీముఖి అడగడంతో "నాకు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. వాడి బిహేవియర్ తేజు బిహేవియర్ సేమ్ గా ఉంటుంది.. ఏడెనిమిదేళ్లు వయసులోనే ఎన్నో కష్టాలను చూసింది. వాళ్ళ అమ్మ కాన్సర్ తో చనిపోయింది. ఆ తర్వాత చదువు తన ఓన్ గా చదువుకుంది. తన కాళ్ళ మీద తానే బతికింది " అని చెప్పాడు. తర్వాత శ్రీముఖి అడిగేసరికి "ఎవరికైనా ఒక ప్లేస్ ఉంటుంది. అది ఫ్యామిలీ . కానీ నాకు అలా కాదు. నాకు ఎక్కడుంటే అదే నా ఫామిలీ. నేను జనాలను కలవడానికి ఎందుకు అంత ఎక్సయిట్ అవుతాను అంటే నేను ఇంటికి వెళ్తే ఒక్కదాన్నే ఉండాలి. నేను ఒంటరిగా ఉండాలి. అందుకే జనాలని కలిసినప్పుడు నాకు అదో పండగలా అనిపిస్తుంది. నాకు పిక్నిక్ కి వచ్చినట్టు ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళిపోగానే అంతా బాధగా అనిపిస్తుంది. పేరెంట్స్ లేరు, ఫ్యామిలీ లేదు నాకు ఒక్కోసారి పని చేయకుండా ఉండాలని అనిపిస్తుంది. కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. రోహిత్ వాళ్ళ ఫ్యామిలీ నువ్వు పని చేయకపోయినా పర్లేదు అని అంటూ ఉంటారు. లైఫ్ లాంగ్ ఫుడ్ పెడతాము అంటారు. అందుకే నాకు వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం." అని చెప్పింది. దాంతో అనసూయ ఏడుస్తూ "నాకు తేజు లాంటి కూతురు ఉండి ఉంటే బాగుండు అనిపించింది" అని చెప్పింది. దానికి తేజు "ఐతే నేను ఉన్నననుకోండి మీ కూతురిగా రేపటి నుంచి సామాన్లు సర్దుకుని వచ్చేస్తాను" అంటూ కామెడీ చేసింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.