English | Telugu
కర్రతో శోభాశెట్టికి క్లాస్ పీకిన నాగార్జున... యావర్ ఈజ్ బ్యాక్!
Updated : Oct 28, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో శనివారం నాటి ప్రోమో కోసం కొన్ని లక్షల మంది జనాలు ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే వారం మొత్తం హౌస్ మేట్స్ చేసిన తప్పులని నిలదీస్తూ హోస్ట్ నాగార్జున క్లాస్ పీకుతాడు. కంటెస్టెంట్స్ కి నాగార్జున వార్నింగ్.. ఇది చూడటానికి మేమంతా సిద్ధం అన్నట్టుగా ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు.
ఇక ఎనిమిదవ వారం హౌస్ లో శోభాశెట్టి చేసిన పర్ఫామెన్స్ కి నాగార్జున గట్టిగా క్లాస్ పీకాలని అందరు భావించి ప్రతీ ప్రోమో కింద శోభాశెట్టికి నెగెటివ్ గా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే శనివారం నాటి ప్రోమో రానే వచ్చింది. నాగార్జున ఒక కర్ర తీసుకొని వచ్చి విరిచేశాడు. శోభాశెట్టిని లేపి.. గతవారం నామినేషన్‌లో భోలే ఎర్రగడ్డ అని అంటే గింజుకున్నావ్. మరి యావర్ ని పిచ్చోడు అని అనడం కరెక్టేనా..నీకు క్షమించే గుణం లేనప్పుడు నువ్వు మాటలు జారకూడదు కదా అని శోభాశెట్టికి వార్నింగ్ ఇచ్చాడు. నాకు యావర్ ఇచ్చిన రీజన్ వ్యాలిడ్ అని అనిపించలేదని శోభాశెట్టి అంది.
మొన్న కెప్టెన్సీ నుండి శోభాశెట్టిని యావర్ తప్పించినప్పుడు జరిగినది చూపించిన నాగార్జున.. " బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని ఎవరు అతిక్రమించకూడదు. బిగ్ బాస్ ప్రాపర్టీని నాశనం చేయకూడదనే రూల్ ఉంది కదా. ఆ వీడియో చూసిన నేనే కాదు ఆడియన్స్ కూడా నిన్ను పిచ్చోడని అనుకుంటారు. మళ్ళీ యూ ఆర్ బ్యాక్ టు ది వొరిజెనల్ బిహేవియర్" అని యావర్ తో అన్నాడు నాగార్జున.