English | Telugu

Nikhil lover kavyashree: నిఖిల్ తో కాకుండా వేరే అతడితో రొమాంటిక్ సాంగ్ చేసిన కావ్యశ్రీ!

కావ్య నువ్వేంటి ఇక్కడ.. ఏ నేను ఇక్కడ ఉండకూడదా.. ఎల్లోరా శిల్పాలు ఇక్కడ ఉండకూడదు కదా అనే డైలాగ్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. బిగ్ బాస్ సీజన్-8 విన్నర్ నిఖిల్ లవర్ కావ్యశ్రీ గురించి ఇప్పుడు ఓ‌ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా రిలీజ్ చేసిన దావత్ ప్రోమోలో‌ సుమతో పాటు రాజీవ్ కనకాల, సమీర్, హైపర్ ఆది ఇంకా కొంతమంది టీవీ యాక్టర్స్ వచ్చారు. ఇక ఇందులో కావ్యశ్రీ కూడా వచ్చింది. కావ్య ఓ సీరియల్ హీరోతో డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేసింది. "హే రంగులే హే రంగులే" అనే పాటకి ఆ హీరోతో కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇది చూసి ప్రోమో కింద నిఖిల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నిఖిల్-కావ్యలను చూసిన కళ్లు ఇలా చూడలేకపోతున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఆ హీరో ఎవడు? అంటూ కొశ్చన్ చేస్తున్నారు. అయితే ఆ హీరో ఈటీవీలో ప్రసారమవుతున్న 'గువ్వ గోరింక' సీరియల్ హీరో తేజస్ గౌడ (నందు). ఈ ధారావాహికలో కావ్య కూడా నటిస్తుంది. దీంతో వీళ్లిద్దరూ కలిసి ఇలా ఓ డ్యాన్స్ చేశారన్నమాట. నిజానికి గతంలో కూడా కావ్య.. ఈటీవీలో పలు షోలు చేసింది. కానీ అందులో నిఖిల్ కూడా వెంట వచ్చేవాడు. ఎప్పుడూ వీళ్లిద్దరే కలిసి పర్ఫామ్ చేసేవారు.. ఒకవేళ ఎవరైనా కావ్యతో కలిసి డ్యాన్స్ చేస్తానన్నా కూడా నిఖిల్ ఒప్పుకునేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు కావ్య ఇలా వేరే వాళ్లతో పర్ఫామ్ చేసేసరికి నిఖిల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

బిగ్ బాస్ సీజన్-8 కి నిఖిల్ వెళ్ళేముందే వారికి బ్రేకప్ అయ్యింది. ‌అయితే హౌస్ లోకి వెళ్ళాక నిఖిల్ లవ్ ఫెయిల్యూర్ ముసుగులో ఉన్నాడని, తను కావాలనే అలా చేస్తాడని కావ్యశ్రీ చాలాసార్లు చెప్పింది. అయితే నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం కావ్యశ్రీని‌ తిడుతూ కామెంట్లు పెట్టేవారు. బయటకొచ్చాక నిఖిల్ చేసే పనులకి కావ్యశ్రీకి అసలు సంబంధమే లేదు. కానీ కావ్యశ్రీ-నిఖిల్ ల మధ్య ఇంకా ప్రేమ ఉందని కొందరు నమ్ముతున్నారు కానీ ఈ ప్రోమో చూసాక వారి మనస్సు మార్చుకుంటారు. అంత రొమాంటిక్ గా వేరే అతడితో కావ్యశ్రీ డ్యాన్స్ చేసింది.‌ ఇది ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.