English | Telugu

కావ్య చేసిన డిజైన్స్ ని మెచ్చుకున్న రాజ్ ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-29 లో.. రాజ్ ఫ్యామిలీకి పెళ్ళికి కావలసిన బొమ్మలు తయారు చేస్తుంటుంది కావ్య. రెండు కుటుంబాలు పెళ్ళి పనులు మొదలుపెడతారు. ఇక రాజ్ ఇంట్లో పెళ్ళి పనులు మొదలు పెట్టి.. గణపతి పూజ చేసి రాజ్ తల్లి రాజ్ కి బొట్టు పెడుతుండగా..‌ రాహుల్ వచ్చి రాజ్ తల్లి చెయ్యి పట్టుకొని ఆపుతాడు. "రాజ్ ఎప్పుడైనా.. ఏదైనా.. నన్నే ముందు ట్రై చేయమంటాడు. ఇప్పుడు నాకంటే ముందే పెళ్ళి చేసుకుంటున్నాడు" అని రాహుల్ అనడంతో.. "ఆట పట్టించే సమయం ఇదేనా రాహుల్" అంటూ రాజ్ తల్లి కోప్పడుతుంది. నన్ను ఆటపట్టించడానికి చేసాడు మమ్మీ అని రాజ్ అంటాడు.

మరోవైపు స్వప్నకి నలుగు పెట్టడానికి కూర్చోపెడతారు. కావ్య, అప్పులు కూడా పక్కనే కూర్చుంటారు. "జరగని పెళ్ళికి ఇదంతా ఎందుకు అమ్మా.. చాలా ఖర్చు పెడుతుంది పాపం.. చెప్దామంటే చెప్పే ఛాన్స్ ఇవ్వట్లేదు" అని రాహుల్ కి మెసేజ్ చేస్తుంటుంది స్వప్న. అంతలోనే కనకం బొట్టు పెడుతుండగా.. వద్దని తన చేతిని పక్కకి నెట్టి వేస్తే.. ఆ బొట్టు కావ్య నుదుటికి పడుతుంది. అక్కడున్న వాళ్ళు మాటలు అనడంతో కావ్య పక్కకి వెళ్ళిపోతుంది. స్వప్న నీవల్ల కావ్య మనసు చిన్నబుచ్చుకుందని కనకం అంటుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి కళ్యాణ్ పంపిన మనిషి వచ్చి తను పెళ్ళికోసం రెడీ చేసిన బొమ్మలను డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాడు.

రాజ్ ఇంట్లోకి కావ్య తయారు చేసిన డిజైన్ లు అన్నీ వస్తాయి. అవి చూసిన రాజ్ కుటుంబసభ్యులందరు.. చాలా బాగున్నాయ్ అంటారు. రాజ్ కి అనుమానం వచ్చి.."ఎవరు చేసారు? ఎక్కడ నుండి తీసుకొచ్చావ్" అని కళ్యాణ్ ని అడుగుతాడు. "ఆ కళావతి మాత్రం కాదు" అని కళ్యాణ్ అంటాడు. కళావతి ఎవరని రాజ్ నానమ్మ అడుగగా.. ఆ రోజు వినాయకుని నగలు డిజైన్ చేసింది కదా.. ఆ అమ్మాయి" అని కళ్యాణ్ చెప్తాడు. ఆ అమ్మాయి ఎప్పుడు చూసిన మన రాజ్ తో గొడవ పడుతూనే ఉంటుందని రాజ్ అమ్మ అంటుంది. ఇక పెళ్ళికూతురికి పెట్డవలసిన బట్టలను నేను తీసుకెళ్తానని రాహుల్ చెప్పి తీసుకెళ్తాడు. మరోవైపు రాజ్ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన కొన్ని వస్తువులు ఇక్కడే ఉన్నాయి.. ఎలాగైనా కళ్యాణ్ కి ఇవ్వాలని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.