English | Telugu

Karthika Deepam2 : రిసెప్షన్ లో జ్యోత్స్న చెంప పగలగొట్టిన దీప.. నీకు బావేమో నాకు దేవుడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2'(Karthika Deepam2 '). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -200లో.... కాశీ, స్వప్న ఇద్దరు ప్రేమ తో కార్తీక్, దీపల ఏవి రెడీ చేసి ప్లే చేద్దామని అనుకుంటారు కానీ జ్యోత్స్న తో ఎంగేజ్మెంట్ అయినప్పుడు జరిగిన వీడియో వస్తుంది. ఆపేస్తుంటే ఆపకని జ్యోత్స్న అంటుంది. నాకు అన్యాయం జరిగిందని కార్తీక్ చెయ్ శౌర్యపై పెట్టి నిజం మాత్రమే చెప్పాలని అంటుంది. నీకు దీప ముందే తెలుసు కదా అని అడుగుతుంది. దాంతో అవును అని కార్తీక్ చెప్తాడు.

చూసారా ముందే దీప పరిచయం ఉంది అయిన కూడ నాతో పెళ్లి వరకు వచ్చాడు. నాకు అన్యాయం చేసాడని జ్యోత్స్న కావాలనే అందరి ముందు దీపని బ్యాడ్ చెయ్యాలని ట్రై చేస్తుంది. నేను నీకు అన్యాయం చెయ్యడమేంటి.. ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని కార్తీక్ అంటాడు. ఈవిడ గారి మాజీ మొగుడు తనని చంపాలనుకుంటే ఆమెకి అడ్డు వెళ్లాడు.. పెళ్లి ఆగేలా చేసుకున్నాడు. ఆ తర్వాత అనసూయ శౌర్యని పక్కకి తీసుకొని వెళ్తుంది. జ్యోత్స్న కార్తీక్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే మాటలు మర్యాదగా రానివ్వండి అని శ్రీధర్ అంటాడు. మొదటి భార్య కొడుకు రిసెప్షన్ కి రెండవ భార్యతో వచ్చిన నువ్వు మాట్లాడుతున్నావా అని పారిజాతం అంటుంది.

ఆ తర్వాత స్వప్న, కాశీ, దాస్ లు వాళ్లని అక్కడ నుండి వెళ్ళమని అంటారు. అయిన జ్యోత్స్న, పారిజాతం వినరు. నాతో పెళ్లికి ఒప్పుకున్నావంటే నేనంటే ఇష్టం ఉంది అయిన దీప కోసం ఇలా చేసావని జ్యోత్స్న అంటుంది. మా బావని కావాలనే నాకు దూరం చేసావ్.‌ అసలు శౌర్యని కూడా నా బావతోనే కని ఉంటావని దీపతో జ్యోత్స్న అనగానే.. జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది దీప. ఇంకొకసారి నా కూతురు గురించి మాట్లాడితే బాగుండదు.. నాకు సుమిత్ర గారు ఎలాగో కార్తీక్ బాబు అలాగే.. తను నీకు బావేమో నాకు దేవుడు.. నా మెడలో తాళి కట్టి నాకు భర్త అయ్యాడు.. తన గురించి తప్పు గా మాట్లాడితే ఇంకో చెంపపగులుతుందని జ్యోత్స్నకి దీప వార్నింగ్ ఇస్తుంది. అదంతా సుమిత్ర చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.