English | Telugu

Karthika Deepam2 : అనసూయని నిలదీసిన దీప.. తను నిజం చెప్పనుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -368 లో..... కార్తీక్ వెళ్తుంటే దీప వద్దని చెప్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నారని దీప నిలదీస్తుంది. దాంతో దీపని ఆవేశంగా పక్కకి తీసుకొని వెళ్తాడు కార్తీక్‌. నువ్వు సుమిత్ర, దశరథ్ ల సొంత కూతురివి.. నువ్వే నా మరదలివి అని కార్తీక్ చెప్పగానే దీప షాక్ అవుతుంది. ఏంటి మీరు మాట్లాడేదని దీప అడుగుతుంది.

అవును దీప నేను చెప్పేది నిజం.. ఇదంతా దాస్ మావయ్య చెప్పాడని కార్తీక్ అంటాడు. ఆయనకే గతం గుర్తులేదు.. మీరు ఆయన చెప్పేది నమ్ముతున్నారా అని దీప అంటుంది. ఆయనకు అంతా తెలుసు.. అందుకే అయన ఎక్కడ నిజం బయట పెడతాడో అని దాస్ మావయ్యని కొట్టింది జ్యోత్స్న. మరి జ్యోత్స్న ఎవరని దీప అడుగుతుంది. దాస్ మావయ్య కూతురు జ్యోత్స్న. పారిజాతం ఇదంతా చేసిందని కార్తీక్ జరిగింది మొత్తం చెప్తాడు. ఇప్పుడు నా ముందు రెండు ఉన్నాయ్.. ఒకటి నిన్ను ఆ కుటుంబానికి దగ్గర చెయ్యడం.. రెండు జ్యోత్స్న నోటితోనే అన్ని నిజాలు చెప్పించాలని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత దీప కుబేర్ ఫోటో దగ్గరకి వచ్చి ఏడుస్తుంది. అనసూయ దగ్గరికి దీప వెళ్లి.. అత్తయ్య నేను నీకు ఎప్పటి నుండి తెలుసని అడుగుతుంది. చిన్నప్పటి నుండి అని అనసూయ అంటుంది. అమ్మకి పురుడు పొసేటప్పుడు ఎక్కడ ఉన్నవని దీప అడుగుతుంది. బయట ఉన్నానని అనసూయ కంగారుగా చెప్తుంది. అప్పుడే కుబేర్ ఫొటోని దీప తీసుకొని వచ్చి.. ఈ ఫోటోపై అనసూయ చెయ్ పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.