English | Telugu

Karthika Deepam2 : కార్తీక్ కి భార్యగా ఉండమని దీపకి చెప్పిన అత్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -201 లో..... దీపని అవమానించాలని పారిజాతాన్ని తీసుకొని జ్యోత్స్న రిసెప్షన్ కి వెళ్తుంది. అక్కడ కార్తీక్, దీపలని జ్యోత్స్న అవమానిస్తుంది. అసలు ఈ శౌర్యని కూడా మా బావతోనే కని ఉంటావని జ్యోత్స్న అనగానే.. తన చెంప చెల్లుమనిపస్తుంది దీప. అయిన ఏ మాత్రం తగ్గకుండా తన రెచ్చిపోయి మాట్లాడుతుంది. అప్పుడే మహిళా సంఘం లీడర్ సరోజినీ దేవి స్టేజ్ పైకి వచ్చి అసలేం చేస్తున్నావని జ్యోత్స్న పై కోప్పడుతుంది.

కార్తీక్ తన ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నాను అంటుంటే.. నీకు ఎక్కడ అన్యాయం జరిగింది.. కావాలని వాళ్ళను అలా చేస్తున్నావ్.. దీప జీవితానికి అండగా నిలబాడ్డాడు.. మీరే ఉద్దేశంతో వచ్చారో ఇక్కడ అందరికి అర్ధమైంది.. అంతే కాకుండ వాళ్ళ ఏవి రాకుండా అది వచ్చింది ఇది కూడ ఎవరు చేసారో అందరికి అర్ధం అవుతుంది.. ఇక్కడ నుండి మర్యాదగా వెళ్తారా లేదా అందరు ఇక్కడ మిమ్మల్ని కొట్టడానికి రెడీగా ఉన్నారని సరోజినీ దేవి అనగానే.. పారిజాతం భయపడి జ్యోత్స్నని తీసుకొని వెళ్తుంది. అమ్మ అందులో నిజం లేదు.. దీప ముందు తెలుసు.. అంతే తప్ప తన గురించి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తెలిసింది అంతే అని కార్తీక్ అనగానే.. నాకు నీపై నమ్మకం ఉందని కాంచన అంటుంది. ఆ తర్వాత అందరు కలిసి ఫ్యామిలీ ఫోటో దిగుతారు. మరొకవైపు పారిజాతం, జ్యోత్స్న లు హాస్పిటల్ కి వెళ్లి వచ్చామని యాక్టింగ్ చేస్తుంటారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లారు కార్తీక్ డాక్టర్ దీప డాక్టర్ కాంచన డాక్టర్ దగ్గరికా అని శివన్నారాయణ‌ అంటుంటే.. పారిజాతం టెన్షన్ పడుతుంది. మీరు ఎక్కడికి వెళ్లారో నాకు తెలుసు ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళు ఫోన్ చేసి మీ భార్య, మనవరాలు వచ్చారు.. మీరు రాలేదని అడిగారు. ఎందుకు వెళ్లారు అంటు శివన్నారాయణ వాళ్ళపై కోప్పడతాడు. అప్పుడే దశరత్ కూడా వస్తాడు. అతను కూడా ఎందుకు వెళ్లారంటూ కోప్పడతాడు. ఇంకా నయం నేను వెళ్ళానంటూ చెప్పలేదని సుమిత్ర అనుకుంటుంది.

మరొక వైపు దీప జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటే.. అప్పుడే అనసూయ వస్తుంది. నీకేం అన్యాయం జరిగిందని భాదపడుతున్నావ్.. నువ్వు కార్తీక్ ని శౌర్యకి నాన్న మాత్రమే అనుకుంటున్నావ్ కని అతను నీకు భర్తగా ఉండాలనుకుంటున్నాడు.. భార్యగా ఉండు అలా ఉంటానని మాట ఇవ్వమని అనసూయ అనగానే.. నేను ఇవ్వలేనని దీప అంటుంది. అయితే నేను ఇంట్లో నుండి వెళ్లిపోతానని అనసూయ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.