English | Telugu

Karthika Deepam 2 : జ్యోత్స్న చేతిలో కీలుబొమ్మలా కార్తీక్.. దశరథ్ తనని ఆపగలడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -366 లో.... కాంచన దగ్గరికి దీప వచ్చి.. కార్తీక్ బాబుని జ్యోత్స్న పనివాడిని చేసింది. అన్ని పనులు చేయిస్తుందని ఏడుస్తుంది. దాంతో కాంచనకి కోపం వస్తుంది. మనవరాలిని పెంచే పద్దతి ఇదేనా అంటూ నిలదియ్యాలి.. మా నాన్న దగ్గరికి వెళ్తానని కాంచన అంటుంటే వద్దని దీప అంటుంది.

మరొకవైపు మన రెస్టారెంట్ కి ఆర్డర్స్ బాగా వస్తున్నాయ్.. ఇక ఇలా అయితే మన రెస్టారెంట్ త్వరలోనే మల్లి ఫస్ట్ కి వస్తుందని దశరత్ తో శివన్నారాయణ అంటాడు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. బ్యాగ్ ఏదే అని పారిజాతం అడుగుతుంది. నా అసిస్టెంట్ తీసుకొని వస్తున్నాడని జ్యోత్స్న అంటుంది. అప్పుడే కార్తీక్ జ్యోత్స్న బ్యాగ్ తీసుకొని వస్తాడు. జ్యోత్స్న చెప్పినట్టు కార్తీక్ చేస్తుంటే దశరథ్ తప్ప మిగిలిన వాళ్లంతా నవ్వుకుంటారు. వీడు నువ్వు చెప్తే చేస్తున్నాడంటే నేను నమ్మడం లేదని పారిజాతం అంటుంటే.. నిన్ను నమ్మించాలంటే ఏం చెయ్యాలి.. నువ్వు వెళ్లి తాత షూస్ తీసుకొని రా అని జ్యోత్స్న అనగానే పారిజాతం తీసుకొని వస్తుంది. బావ ఆ షూ క్లీన్ చెయ్ అని జ్యోత్స్న అనగానే సరే అని కార్తీక్ క్లిన్ చేస్తాడు. ఎందుకురా ఇదంతా అని దశరత్ అంటాడు. ఇది సంతకానికి ఉన్న పవర్ మావయ్య అని కార్తీక్ అంటాడు. అదంతా జ్యోత్స్న వీడియో తీస్తుంది.

ఆ తర్వాత కార్తీక్ ని అందరికి భోజనం వడ్డించమని జ్యోత్స్న చెప్తుంది. దాంతో కార్తీక్ ఆలాగే చేస్తాడు. ఆ తర్వాత కార్తీక్ ని జ్యోత్స్న తన రూమ్ కి తీసుకొని వెళ్లి.. ఏసీ ఆన్ చెయ్యమంటుంది. బెడ్ సెట్ చేయమంటుంది. పడుకో జ్యోత్స్న కొన్ని రోజులే కదా ప్రశాంతంగా పడుకునేది అని కార్తీక్ అనేసి వెళ్లిపోతాడు. బావకి ఏదైనా నిజం తెలిసి ఉంటుందా.. ఛాన్స్ లేదు.. ఈ వీడియో ఇప్పుడు దీపకి పంపాలని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు కార్తీక్ అలా చేస్తుంటే చూడలేకపోతున్నాను.. మనమే ఇది ఆపాలని సుమిత్రతో దశరథ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.