English | Telugu

Karthika Deepam 2: జ్యోత్స్న రూమ్ లో సీక్రెట్ కెమెరా.. కాశీతో కలిసి ఆమె ఆడే ఆటలు కార్తీక్ కనిపెడతాడా?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -552 లో... కార్తీక్ దగ్గరకు రాత్రి స్వప్న ఏడుస్తూ వస్తుంది. ఇంత రాత్రి ఎందుకు వచ్చావని కార్తీక్ కోప్పడతాడు. కాశీకి జాబ్ వచ్చిందని జరిగింది మొత్తం చెప్తుంది. నాన్న అరెస్ట్ కి కాశీకి ఏదో సంబంధం ఉందని అర్థం అవుతుందని స్వప్న అనగానే కార్తీక్, దీప షాక్ అవుతారు. అవన్నీ ఏం పట్టించుకోకు.. నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్తాడు. కాసేపటికి స్వప్నని కార్తీక్ వెంటతీసుకొని ఇంటికి వెళ్తాడు.

ఆ తర్వాత కార్తీక్ తో స్వప్న మాట్లాడుతుంటే.. కాశీ ఎంట్రీ ఇస్తాడు. జాబ్ వచ్చిందట చెప్పలేదని కార్తీక్ అడుగుతాడు. జాయిన్ అయ్యాక చెప్దాననుకున్న బావ అని కాశీ అంటాడు. మీ మావయ్యకి చెప్పవా అని కార్తీక్ అనగానే ఎలా చెప్పాలి.. స్టేషన్ లో ఉన్నాడు కదా అని కాశీ అనగానే.. వస్తాడు నువ్వు వెళ్ళేలోపు నీకు సెండాఫ్ ఇవ్వడానికి ఖచ్చితంగా వస్తాడు. ఎందుకు అంటే నాకు అసలు ఇదంతా ఎవరు చేసారో తెలిసింది. అన్ని బయటకు రప్పిస్తానని కార్తీక్ అనగానే కాశీ టెన్షన్ పడతాడు. ఇదంతా ఎవరు చేసారో తెలిస్తే అసలు వదులొద్దు అన్నయ్య అని స్వప్న అంటుంది. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్తాడు. వాళ్ళకి కాశీ పైన డౌట్ వస్తుంది. అసలు ఇదంతా వెనకాల ఉండి ఎవరు నడిపిస్తున్నారో కనుక్కోవాలనుకుంటారు.

మరొకవైపు ఇదంతా కాశీతో నేనే దగ్గర ఉండి చేయించానని పారిజాతంతో జ్యోత్స్న చెప్పగానే పారిజాతం భయపడుతుంది. కానీ కాశీతో జ్యోత్స్న ఫోన్ లో మాట్లాడగానే పారిజాతం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ ఏం జరగనట్లు వచ్చి.. ఇంట్లో పనులు చేసుకుంటాడు. జ్యోత్స్నకి డౌట్ వస్తుంది. మరొక వైపు జ్యోత్స్న ఉండే ప్లేస్ లో దీప ఫోన్ కెమెరా ఆన్ చేసి పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.