English | Telugu

ఎమోషనల్ అయిన హిమ.. కార్తిక్, దీపల మనసు కరుగుతుందా..!


'కార్తీకదీపం' సీరియల్ ఇప్పుడు మాటీవి ప్రేక్షకులను సరికొత్తగా అలరిస్తోంది. బుధవారం జరిగిన ఎపిసోడ్ లో కార్తీక్, దీపలను వెతుక్కుంటూ వాళ్ళు ఉన్న ఇంటికే వస్తుంది సౌందర్య. అయితే కార్తిక్ చాటుగా సౌందర్యని చూసి, ఇంటి లోపలికి వస్తుందేమో అని గ్రహిస్తాడు. ఇంటికి తాళం వేసి దాక్కుంటాడు. ఆ తర్వాత అలా ఇంటికి తాళం ఉండటం చూసి సౌందర్య తిరిగి వెళ్ళిపోతుంది. కాసేపటికి బయటకొచ్చిన దీప.. తాళం చూసి కార్తిక్ ని అడుగుతుంది. "ఏంటండి.. ఇంటికి తాళం వేశారు" అని అడుగుతుంది. "మనల్ని వెతుక్కుంటూ అమ్మ ఇక్కడికి వచ్చింది. లోపలికి వస్తుందేమోనని తాళం వేశాను. సమయానికి పండరి లేకపోవడం మంచి పని అయింది" అని కార్తీక్ అంటాడు. "పండరి ఉన్నా కూడా.. మన గురించి చెప్పదు" అని అంటుంది దీప.

కాసేపటికి హేమచంద్ర ఇంటికి వెళ్తుంది దీప. ఆ తర్వాత దోశలు చేస్తుంది. "నేను చేసిన దోశలు, దోసకాయ చట్నీ అంటే నా కూతురు హిమకి ఇష్టం. ఇవి తీసుకెళ్ళి తనకి ఇవ్వండి. ఆ తర్వాత నేను అత్తయ్యతో మాట్లాడుతాను. మీరు అత్తయ్యని ఇక్కడికి తీసుకురండి. జరిగిందంతా చెప్తాను. అప్పుడైనా డాక్టర్ బాబు వాళ్ళ అమ్మ వెళ్తాడు" అని హేమచంద్రతో అంటుంది దీప. దానికి హేమచంద్ర "సరే అమ్మ.. తీసుకొస్తాను" అని బయల్దేరుతాడు. అలా వెళ్తుండగా కార్తీక్ ఎదురొస్తాడు. "ఏంటి దీప నువ్వు చేస్తుంది. ఏది ఏమైనా నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను" అని కార్తీక్ గట్టిగా చెప్తాడు. అలా చెప్పి బయల్దేరుతుండగా హిమ వస్తుంది. హిమని చూసి దీప, కార్తీక్ లు దాక్కుంటారు. "అమ్మ నాన్నలను వెతకడానికి వెళ్తున్నారంట కదా అంకుల్.. నన్ను కూడా తీసుకెళ్ళండి" అని హేమచంద్రతో అంటుంది హిమ. దానికి "సరే అమ్మ" అని హేమచంద్ర అంటాడు.

ఆ తర్వాత దీప చేసిన టిఫిన్ ని హిమకి ఇస్తాడు హేమచంద్ర. ఆ టిఫిన్ తింటూ "ఈ పచ్చడి అచ్చం అమ్మ చేసినట్లే ఉంది" అని ఎమోషనల్ అవుతుంది హిమ. "అమ్మ చేసినట్లు ఉంటే.. అమ్మే చేసిందనుకోరా" అని హేమచంద్ర అంటాడు. "మేం అందరం కలిసి, ఇలా ఎప్పుడు తింటామో.. ఇక నేను వెళ్తున్నాను అంకుల్" అంటూ హిమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా హిమ బయటకు వెళ్ళిన తర్వాత దాక్కున్న కార్తీక్, దీప ఇద్దరు బయటకొస్తారు. హేమచంద్రతో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇద్దరు. అలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.