English | Telugu
‘కమనీయం కార్తీకం’ షోలో ఆలీతో సరదాగా మినీ షో..ఫుల్ ఎంటర్టైన్మెంట్
Updated : Nov 16, 2022
కార్తీకమాసం సందర్భంగా "కమనీయం కార్తీకం" పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ బుల్లితెర పై ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయ్యింది. ఈ షోకి హోస్ట్ గా యాంకర్ రవి, రౌడీ రోహిణి చేశారు. ఇక ఈ షోకి ఆలీ, శ్రీవాణి ఫామిలీ, విశ్వా ఫామిలీ, శివ బాలాజీ, సీరియల్ యాక్టర్స్ వచ్చిన ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ షోలో ఆలీతో సరదాగా ఒక మినీ షో చేసి ఎంటర్టైన్ చేసాడు ఆలీ. ముందుగా రాకింగ్ రాకేష్, సుజాతని ఇంటర్వ్యూ చేసాడు.
"రాకేష్ నీకు ఎంత బంగారం కొనిపెట్టాడు" అని సుజాతను అడిగేసరికి "నాకేం కొనలేదు నా దగ్గర రావాల్సినవన్నీ రాబట్టేసారు" అని కామెడీ గా చెప్పింది సుజాత. తర్వాత శ్రీవాణి ఫామిలీని ఇంటర్వ్యూ చేసాడు. "నేను మా ఆయన్ని బాగా ఫాలో అవుతాను" అని శ్రీవాణి అనేసరికి ఎలా అని ప్రశ్నించాడు. దానికి శ్రీవాణి హస్బెండ్ "భార్యాభర్తలు అంటే సగం సగం అంటారు కానీ మేము అలా కాదు ఫుల్" అనేసరికి "అంటే ఫుల్ బాటిల్ తీసుకొస్తే ఐపోవాలి" అంతేకదా అని ఫన్ చేసాడు ఆలీ. ఇక ఈ షోలో పిల్లలంతా మహాశివుడి సాంగ్స్ పడేసరికి అందరిలో భక్తి భావం పొంగిపొర్లింది. ఇక ఈ షో ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు ఈటీవీలో ప్రసారం కాబోతోంది.