English | Telugu

లివింగ్ రిలేషన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జ్యోతిరెడ్డి!

బుల్లితెర నటి జ్యోతిరెడ్డి గురించి అందరికి సుపరిచితమే. తను తొమ్మిదేళ్ళకే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తను చదువులో ముందుండేదంట.. అయితే వాళ్ళ అమ్మ తనని ఇండస్ట్రీకి వెళ్ళమని బలవంతం చేయడం వల్లే తను ఇప్పుడు ఇక్కడ ఉన్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఇక్కడ షూటింగ్ వరకే అందరితో కలిసి మాట్లాడుతుందంట.. ఒక్కసారి ఇంటికివెళ్ళాక అసలు ఎవరితోను మాట్లాడదంట. తను మాజీ ఏపీ సీఎం వెంకట్రామిరెడ్డి మనుమరాలంట. డిగ్రీ, ఎంఏ, ఎంఫిల్.. వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్ సంపాదించిందంట జ్యోతిరెడ్డి.

ఎండమావులు సీరియల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న జ్యోతిరెడ్డి.. ఆ తర్వాత అనేక సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల మదిలో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. అప్పటి నుండి రీసెంట్ గా ముగిసిన కార్తీకదీపం వరకు నెగెటివ్, పాజిటివ్ అనే తేడాలేకుండా అన్నింటిలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది జ్యోతిరెడ్డి. పున్నాగ, రక్త సంబంధం సీరియల్స్ తనకి మంచి గుర్తింపు తెచ్చాయి. ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్ లో ఏసీపీ రోషిణి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా స్టార్ మా టీవీలో స్టార్ట్ అయిన 'మధురానగరి' సీరియల్ లో హీరోకి తల్లిగా చేస్తుందన్న విషయం తెలిసిందే. అంతకముందు ఎన్నో సీరియల్స్ లో చేసింది.

తన ఇన్ స్టాగ్రామ్ లో సీరియల్ నటి జ్యోతి రెడ్డి కొన్నింటిని షేర్ చేసుకుంది. ట్రెండింగ్ ని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు కొత్తవిషయాలను తన అభిమానులతో పంచుకునే జ్యోతి రెడ్డి.. ఇప్పుడు లివింగ్ రిలేషన్స్ పై యువతకి ఒక సందేశం ఇచ్చింది. చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళు, నానమ్మతో మాట్లాడు, ట్యూషన్ లో ఓ గంట ఎక్కువ టైం ఉండి చదువుకో అంటేనే అమ్మ బాబాయో అనే వీళ్ళు.. ఇప్పుడు పెద్దయ్యాక.. అమ్మాయి, అబ్బాయికి ఇద్దరికి ఒకరికొకరు నచ్చగానే లివింగ్ రిలేషన్ అని కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. పాలు ఎంత టెంపరేచర్ లో వేడిచేయాలో తెలియని వీళ్ళు రేపు పొద్దున్న ఆ అమ్మాయితో ఏం చేస్తారు. మీరు సెటిల్ అయ్యాక.. అబ్బాయో, అమ్మాయో నచ్చితే ఇంట్లో చెప్పండి.. అప్పుడు మీ పేరెంట్స్ మాటకి మీరు కట్టుపడి ఉంటే.. అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళే మాట్లాడి.. మీ పెళ్ళి చేస్తారు. అప్పుడు మీ పేరెంట్స్ తోనే కలిసి ఉండొచ్చు కదా అని జ్యోతిరెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో చెప్పుకొచ్చింది. కాగా ఇప్పుడు ఈ వీడియోకి మంచి స్పందన లభిస్తుంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.