English | Telugu

సుమ మీద తారక్ ఫైర్.. కంట్రోల్ చేసిన కళ్యాణ్ రామ్!

రీసెంట్ గా జరిగిన ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ మీద ఫైర్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ నటించిన "అమిగోస్" మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మూవీ టీమ్ . ఈ కార్యక్రమానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇంతలో సుమ మాట్లాడుతూ "సొంత పర్సనల్ కానీ ఫామిలీ అప్ డేట్స్ కోసం మీరు ఎదురు చూడరు కానీ ఎన్టీఆర్@30 ఎప్పుడు అని ఎదురుచూస్తున్న ప్రతీ ఫ్యాన్ కోసం ఇప్పుడు ఎన్టీఆర్ గారు మాట్లాడబోతున్నారు" అంటూ సుమ మైక్ ఇచ్చేసరికి అప్పటికే సుమ మీద సీరియస్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మైక్ తీసుకుని "వాళ్ళు అడగకపోయినా నువ్వు చెప్పేసేలా ఉన్నావ్" అన్నాడు.

ఆమె వైపు చాలా కోపంగా చూస్తూ..కళ్యాణ్‌రామ్‌ తన తమ్ముడుని కాస్త కూల్ చేయడానికి ట్రై చేశారు. ఇక మూవీ అప్ డేట్ గురించి మాట్లాడుతూ ఇంట్లో ఉండే మా భార్యకంటే ముందుగా మీకు చెప్తాం అని విన్నవించారు. ఇక ఈ ఎన్టీఆర్@30 మూవీ ఈ నెలలో మొదలుపెడతాం. మార్చ్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం 2024 ఏప్రిల్ 5 న ఈ మూవీని రిలీజ్ చేస్తాం అని చెప్పుకొచ్చారు. మేము చేసే చిత్రాలకు ఎన్ని అవార్డులు వచ్చినా అది మీ గొప్పతనం..మీ ఆశీర్వచనం వలెనే మేము ఇప్పుడు ఇలా ఉన్నాం అని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్.

ఇక సుమ చేసిన పనికి నెటిజన్స్ కూడా నెగటివ్ కామెంట్స్ తో ఆమెను ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.