English | Telugu

Brahmamudi : ఇంటికి వచ్చేసిన రాజ్.. కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసి...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -813లో... యామిని ఇంటికి వస్తుంది. 'ఆ రాజ్, కావ్య ఒక్కటవుతారు.. నాకు బావ కావాలి' అంటూ ఇంట్లో వస్తువులన్నీ యామిని విసిరేస్తుంటే వాళ్ళ నాన్న తనపై కోప్పడతాడు.

మరొకవైపు రాజ్ కి గతం గుర్తుకొస్తుంది. డాక్టర్ మళ్ళీ ఇంజక్షన్ ఇవ్వడంతో స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి.. తనకి గతం గుర్తుకొచ్చింది.. మళ్ళీ మీరేం స్ట్రెస్ చెయ్యకూడదని చెప్తాడు. తనకి యాక్సిడెంట్ వరకే గుర్తుంది. ఆ తర్వాత గతం మర్చిపోయింది ఏం గుర్తు లేదని డాక్టర్ చెప్తాడు. దానికి ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.

రాజ్ స్పృహలోకి వచ్చేసరికి కావ్య ఎదురుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావ్ కళ్ళు తెరిచేసరికి నా ముందే ఉండాలి కదా అని రాజ్ అనగానే మీ చెయ్యి ఎప్పటికీ వదలనని రాజ్ చెయ్ పట్టుకుంటుంది కావ్య. ఆ తర్వాత రాజ్ ఇంటికి తిరిగి వస్తున్నాడని సీతారామయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాజ్ వాళ్ళు రాగానే దిష్టి తియ్యమంటాడు సీతారామయ్య.

రాజ్ ఇంట్లోకి రాగానే కావ్య ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. ఎందుకు కళావతి అలా వెళ్తుంది అని రాజ్ అడుగగా అపర్ణ జరిగింది మొత్తం చెప్తుంది. తను ప్రెగ్నెంట్.. ఆ విషయం నీకు ఎలా చెప్పాలో తనకి అర్ధం కాక నరకం అనుభవించిందని రాజ్ కి అపర్ణ చెప్తుంది. అది విని కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి మాట్లాడతాడు.

తరువాయి భాగంలో కావ్య ప్రెగ్నెంట్ అని తనని మెట్లు కూడా ఎక్కనివ్వకుండా ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.