English | Telugu

'జబర్దస్త్' వినోద్ (వినోదిని) పెళ్లి చేసుకున్నాడు!

'జబర్దస్త్' షో బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతుంది. ఈ షోని ఇష్టపడే వాళ్లతో పాటు హేట్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఈ షో చాలా మందికి లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఇందులో లేడీ గెటప్పులు వేసే ఆర్టిస్ట్ ల పట్ల సమాజంలో చులకనభావం ఉంటుంది. వారిపై రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. పెళ్లికి సంబందించిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. సమాజంలో ఎన్నో వేధింపులు ఎదుర్కొంటున్నామంటూ 'జబర్దస్త్' లేడీ గెటప్ ఆర్టిస్ట్ లు చాలా సార్లు బహిరంగంగా కామెంట్స్ చేశారు.

లేడీ గెటప్ వేసే 'జబర్దస్త్' వినోదిని (వినోద్) ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు. ఆ మధ్య ఇంటి యజమాని గొడవతో వార్తల్లో నిలిచాడు. ఇక ఇప్పుడు 'జబర్దస్త్' షోలో కూడా కనిపించడం లేదు. తాజాగా యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇందులో మొదటి వీడియోతోనే షాకిచ్చాడు. తనకు పెళ్లి జరిగిందంటూ చెబుతూ తన భార్యను పరిచయం చేశాడు.

తన అత్త కూతురు విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. చిన్నప్పటినుండి కలిసే పెరిగామని.. లాక్ డౌన్ లో తన పెళ్లి జరగడం గమ్మత్తుగా అనిపించిందని తెలిపాడు. చాలా మంది ఎన్నో ఇంటర్వ్యూలలో తనను పెళ్లి గురించి అడిగారని.. వారందరికీ సమాధానం ఇవ్వడానికి తన భార్యతో వీడియో చేస్తున్నట్లు చెప్పాడు వినోద్‌.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.