English | Telugu

''టీమ్ లీడర్ స్థాయికి సుధీర్ అర్హుడేనా..?''

'జబర్దస్త్' షోతో సుడిగాలి సుధీర్ టీమ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ టీమ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ఏకంగా త్రీ మంకీస్ అనే సినిమా కూడా వచ్చింది. బుల్లితెరపై ఈ ముగ్గురు (సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్) కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. 'జబర్దస్త్' షోలో ఈ టీమ్ కి తిరుగులేదు. అయితే అప్పడప్పుడు ఈ టీమ్ విషయంలో కొన్ని నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తుంటాయి.

గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్‌ల కారణంగానే టీమ్ నడుస్తుందని.. ఇందులో సుధీర్ టాలెంట్‌ పెద్దగా ఉండడం లేదని అంటున్నారు. డిఫరెంట్ గెటప్స్ తో, మేన‌రిజ‌మ్స్‌తో శ్రీను, పంచ్‌లతో రామ్ ప్రసాద్ ఆకట్టుకుంటుంటే.. సుధీర్ క్రెడిట్ కొట్టేస్తున్నాడనే ఫీలింగ్ కొందరిలో ఉంది. కానీ బుల్లితెరపై సుధీర్‌కు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో చాల‌మందికి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా టీమ్ లీడర్ ప‌ద‌వికి సుధీర్ అర్హుడేనా అంటూ ఓ నెటిజన్ గెటప్ శీనుకి అడిగాడు.

దీనికి అతడు చెప్పిన సమాధానం ఆకట్టుకుంటుంది. ''మీ దృష్టిలో సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్ స్థాయికి అర్హుడేనా..?' అని ఓ నెటిజన్ గెటప్ శీనుని అడగ‌గా.. దానికి అతడు.. వంద శాతం అంటూ సుధీర్‌కు ఆ సమర్ధ‌త‌ ఉందనే అర్ధం వచ్చేట్లుగా ఎమోజీలను షేర్ చేశాడు. ఇక సుధీర్ గురించి ఒక్క మాటలో చెప్పమని మరో నెటిజన్ అడగగా.. 'జాన్ జిగిరీ' అంటూ బదులిచ్చాడు శ్రీ‌ను. నిజ‌మే.. ఈ ముగ్గురూ జాన్ జిగిరీలే!!

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.