English | Telugu
జ్వరం వస్తే పెరుగన్నం తినాలంట!
Updated : Jun 20, 2023
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది తమలోని ట్యాలెంట్ ని మెరుగుపరుచుకొని సినిమాలలో అవకాశాలు పొందుతున్నారు. కొందరు బుల్లితెర షోస్ లో తమ సత్తాని చాటుతుండగా మరికొందరు ధారవాహికల్లో నటిస్తున్నారు. కాగా ఇందులో తన కామెడీతో క్రేజ్ సంపాదించుకుంది జబర్దస్త్ వర్ష.. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ఇమాన్యుయల్ తో కలిసి ఒకే టీంలో చేసి కామెడీని పండిస్తుంది.
జబర్దస్త్ స్టేజ్ పై సుధీర్, రష్మీ జోడీ తర్వాత మళ్ళీ అంతటి క్రేజ్ వచ్చింది ఇమాన్యుయల్-వర్ష జోడికే.. అయితే వీరిద్దరు కలిసి మొదట్లో ఏ స్కిట్ చేసినా హిట్టే అయ్యేది. ఆ తర్వాత తన జన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటోంది వర్ష. అయితే ఆ మధ్య తను 'సర్' సినిమాలోని మాస్టారు మాస్టారు పాటకి ఒక డ్యాన్స్ రీల్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఫుల్ గా ట్రోల్స్ వచ్చాయి. ఎందుకంటే ఆ పాటలో వర్ష బ్లౌజ్ చిన్నగా ఉండటం.. అందాలన్నీ కనిపించేలా ఉండటంతో ఆమె మీద నెగెటివ్ గా ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత రీల్స్ తగ్గించేసిన వర్ష ఈ మధ్యే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసింది.
అయితే వర్షకి జ్వరం వచ్చిందంట.. దాంతో తను ట్లాబ్లెట్ వేసుకుంటున్నట్టుగా ఒక వీడీయోని, ఇడ్లీని చూపిస్తూ మరో వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా మూడవ వీడియోలో ఫీవర్ కి పెరుగున్నం తినాలని చెప్పింది వర్ష. దీంతో చాలా మంది ఫ్యాన్స్ తను త్వరగా కోలుకోవాలని మెసేజెస్ చేస్తున్నారంట. ఆ విషయాన్ని వర్ష స్వయంగా వెల్లడించింది. మరి పెరుగన్నం తిని జ్వరం తగ్గించుకుంటానని చెప్పిన వర్ష.. తనకొచ్చిన జ్వరాన్ని గెలిచి మళ్ళీ ఎప్పటిలాగా అవుతుందా చూడాలి మరి.