Read more!

English | Telugu

పాగల్ పవిత్రకు లవ్ ప్రొపోజ్ చేసిన సంతోష్


షో ద్వారా ఫిమేల్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. సోషల్ మీడియాలో పాగల్ పవిత్రగా ఎంతో ఫేమస్. జబర్దస్త్ మాత్రమే కాదు అన్ని రకాల ఫెస్టివల్స్ కి, ఈవెంట్స్ లో రెగ్యులర్ గా సందడి చేస్తుంటుంది. అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫాన్స్ తో టచ్ లో ఉంటూనే ఉంటుంది. ఈమె ఎక్కువగా రోహిణితో చాలా క్లోజ్ గా ఉంటుంది.  ఆ మధ్య ఒక షోలోకి సంతోష్ అనే పర్సన్ వచ్చి పవిత్రని బొకే ఇచ్చి లవ్ ఎక్సప్రెస్ చేసాడు.

ఇక ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వీళ్ళిద్దరూ వచ్చి ఎన్నో విషయాలు చెప్పారు. అసలే వాలెంటైన్స్ డే కూడా కాబట్టి సంతోష్ పవిత్రకి లవ్ ప్రపోజ్ చేసాడు. ‘ప్రేమిస్తున్నాను కాబట్టి.. భరిస్తా అనట్లేదు, భరించగలను కాబట్టే ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యూ పవిత్ర’ అని చెప్పేసరికి కిసుక్కున నవ్వేసింది పవిత్ర కానీ ఆ మాటకు ఏ విధంగానూ రియాక్ట్ కాలేదు. అమ్మాయిలం కాబట్టి కొంచెం టైం తీసుకుని ఆలోచించి చెప్తాను అని అంది. సంతోష్ మాట్లాడుతూ.. " మా ఇంట్లో అందరూ అబ్బాయిలే నేను..హాస్టల్ ల్లోనే ఎక్కువగా ఉండేవాడిని. అలా నేను అమ్మాయిలకు దూరంగా ఉండేవాడిని. జబర్దస్త్ మరో లేడీ కమెడియన్ షబీనా తన హజ్బెండ్ మున్నా నేను క్లాస్మేట్స్..అలా వాళ్ళతో పవిత్రను చూసేసరికి అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అనిపించింది. 

తర్వాత ఆమె గురించే ఎక్కువగా ఆలోచించేవాడిని. ముందుగా నేను చెప్పేది ఏమిటంటే తనొక అమ్మాయి, నేనొక అబ్బాయి. అలా నేను తనను లవ్ చేస్తున్నాను. అది ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం తన ఇష్టం అన్నాడు. దాదాపు అతని మాటలకు పవిత్ర పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యింది కానీ.. కన్ఫర్మ్ చేయలేదు. నువ్వు నాతో ఉంటే నిన్న మా అమ్మలా చూసుకుంటాను" అని చెప్పాడు సంతోష్.