English | Telugu

ఆసియా, నూకరాజు విడిపోయారా.. అసలేం జరిగిందంటే!

అవును వాళ్ళిద్దరు విడిపోయారు.. ఇది నిజమే. వాళ్ళిద్దరికి సెట్ అవ్వలేదు. ఇన్నిరోజులు ఇద్దరు బాగానే ఉన్నారు కదా మరి. అవును కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికి సెట్ అవ్వలేదు.. ఎహె ఎంతసేపు ఇంకా వాళ్ళిద్దరు.. వాళ్ళిద్దరు. ఎవరు ఆ ఇద్దరు? అంటే.. లవ్ బర్డ్స్.. గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు నూకరాజు-ఆసియా.

తాజాగా వారిద్దరికి బ్రేకప్ అయిందంటు నూకరాజు ఆసియా ఓ వ్లాగ్ లో చెప్పాడు. అసలేం జరిగిందంటే... లవ్ లో గొడవలు కామన్‌. ఇంతకముందు మా మధ్య కొన్ని గొడవలు వచ్చాయి. కానీ తర్వాత కలిసి ఉన్నాం. అలా అని వాడుకొని వదిలేసే టైప్ నేను కాదని నూకరాజు అన్నాడు. అసలేం జరిగిందంటే మొన్న పదో తారీఖున ఒక ఈవెంట్ కోసం దుబాయ్ కి వెళ్ళాను. అక్కడ షూటగ్ అయిదు రోజులు జరిగింది. పద్నాలుగున తన బర్త్ డే కాబట్టి తను ఫోన్ చేసినట్టుంది. కానీ ఫోన్ ఇక్కడ కలవలేదు. దాంతో తను అలిగింది. నాకు కాల్స్ గానీ మెసెజ్ లు గానీ చేయడం లేదని , తనకే అంత ఉంటే నాకెంత ఉండాలని నూకరాజు చెప్పుకొచ్చాడు. మరి వీళ్ళ మధ్య ప్రస్తుతం చిన్నగొడవ ఉంది. దానిని ఆసియా ఎలా అర్థం చేసుకుంటుంది. వీళ్ళిద్దరు మళ్ళీ కలుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

జబర్దస్త్ లో ఫేమస్ అవుదామని కలలు కని ఉద్యోగం కూడా మానుకుని కామెడీ చెయ్యడానికి వచ్చిన నూకరాజు ప్రస్తుతం జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడు. తాజాగా అతనొక ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. జబర్దస్త్ లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను, టీమ్ లీడర్లుగా ఉన్న వాళ్ళు, సీనియర్స్ కొందరు కుళ్ళు రాజకీయాలు ప్రదర్శిస్తారని.. తనని తాను నిరూపించుకుని ఎదుగుతున్న టైంలో ఆ కుళ్ళు రాజకీయాలని భరించలేకపోయానని నూకరాజు చెప్పాడు. అసలు జబర్దస్త్ షోలో ట్యాలెంట్ గురించి పట్టించుకునేది చాలా తక్కువ. వాళ్ళకి కావలసిన వాళ్ళని మాత్రమే హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తారంటూ ఓ ఇంటర్వూలో తాజాగా చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పుడు ఆసియాతో బ్రేకప్ అయ్యుందటూ చేసిన ఈ వ్లాగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి మీరు ఈ వ్లాగ్ ని చూసారా.. లేదంటే ఓసారి చూసేయ్యండి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.